- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెచ్‌ఎండీఏ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు
X
దిశ, వెబ్ డెస్క్: గచ్చిబౌలిలోని నానక్‌రామ్‌గూడ హెచ్‌ఎండీఏ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం సోదాలను నిర్వహించారు. నానక్ రాంగూడతో పాటు దూలపల్లి అటవీ శాఖ క్యార్టర్స్ లోని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, అర్బన్ ఫారెస్ట్రీ వింగ్ అధికారి ఇనుపనూరి ప్రకాశ్ ఇంట్లోనూ ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి.
ఔటర్ రింగు రోడ్డు ప్రాంతాల్లో చెట్లను పెంచే విషయానికి సంబంధించి బిల్లుల్లో లంచాలను తీసుకున్నట్టు ఏసీబీ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో గచ్చిబౌలీతో పాటు నానక్ రాం గూడలోని ఆయన కార్యాలయంలో ఏసీబీ సోదాలను నిర్వహించింది. కాగా సోదాల్లో ఆయన చాంబర్‌లో రూ. 10లక్షల 50వేలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రకాశ్ కారులో కూడా రూ. 19వేల 800లను ఏసీబీ అధికారులు గుర్తించారు.
Advertisement
Next Story