- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ పీపీఈ కిట్ల ప్రత్యేక ఏంటంటే…: మేకపాటి గౌతమ్ రెడ్డి
దేశంలో ప్రప్రధమంగా కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కరోనా పరీక్షల కోసం పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు తయారు చేస్తున్నామని పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పీపీఈ కిట్లను ముఖ్యమంత్రి చేత ఆవిష్కరింపజేసిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో నెలాఖరు నాటికి రోజుకి 3 నుంచి 4 వేల కరోనా టెస్టులు జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ఆ లక్ష్యంతోనే పీపీఈ కిట్ల తయారీ చేపట్టామని ఆయన చెప్పారు. దేశంలోనే తొలిసారి ఏపీలో వీటి తయారీ చేపట్టామని ఆయన అన్నారు. వీటితో పాటు వెంటిలేటర్లు కూడా తయారు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా వీటిని సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. ఈ కిట్లను సులభంగా టీబీ మెషిన్లకు అమర్చుకునేలా తయారు చేస్తున్నామని చెప్పారు. వీటి ప్రత్యేక కూడా అదేనని అన్నారు. తద్వారా వీటి కోసం కొత్త మెషీనరీని నెలకొల్పాల్సిన అవసరం లేదని, అవసరం బట్టి టీబీ లేదా కరనా టెస్టులు నిర్వహించేలా అమర్చుకోవచ్చని, తద్వారా సమయంతో పాటు అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని ఆయన వెల్లడించారు.
మొట్టమొదటి ఇండియన్ మేడ్ వెంటిలేటర్లను విశాఖలో తయారు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మెడ్‌టెక్ జోన్‌కు నిధులిచ్చి, ముఖ్యమంత్రి ముందుచూపుతో దానిని అందుబాటులోకి తీసుకొచ్చారని ఆయన తెలిపారు. సీఎం దార్శనికతే పీపీఈ కిట్ల తయారీకి కారణమని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ మాటల మనిషి కాదని, చేతల మనిషి అని ఆయన అభినందించారు. కరోనా కారణంగా కార్మికులతో పాటు వివిధ పరిశ్రమ వర్గాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
Tags: corona test kits, ppe kits, ap made corona test kit, ventilators, vizag made ventilators, goutham reddy