- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిబంధనలు బ్రేక్.. మైనర్ బాలికకు అబార్షన్
దిశ, జగిత్యాల : రాయికల్ మండల కేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలికకు అబార్షన్ చేస్తామని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన జగిత్యాలలోని జోష్ణ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని రాయికల్ మాజీ ఎంపీపీ భర్త తిరుపతి జగిత్యాల జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్‌కు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. రాయికల్ మండలానికి చెందిన ఓ బాలిక మోసపోయిన ఘటనలో అబార్షన్ చేస్తామని జోష్ణ ఆసుపత్రి నిర్వాహకులు ఆసుపత్రిలో చేర్చుకున్నారు.
ఆ సమయంలో సంబంధిత అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి యాజమాన్యాం వ్యవహరించిందని తిరుపతి పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఆస్పత్రి చర్యలను సీరియస్‌గా తీసుకుని చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తిరుపతి కోరారు. మైనర్ బాలికకు గర్భస్రావం చేయడం నేరంగా పరిగణించాలని కోరారు. పోలీసులు, బాలల సంరక్షణ అధికారులు, అభాగ్యులను ఆదుకునే సఖీ సెంటర్ నిర్వాహకులు ధృవీకరించినా కూడా జోష్ణ ఆసుపత్రి యాజమాన్యం చట్టాలను ధిక్కరించి గర్భస్రావానికి పూనుకున్నారని వివరించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యశాఖ అధికారికి ఇచ్చిన వినతిపత్రంలో మాజీ ఎంపీపీ భర్త కోరారు.