- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంతా క్యాంపు రాజకీయమేనా..??
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ నెల 9న జరిగే ఎన్నికలు జరుగనుండగా మైకుల మోత, ప్రచార హోరు, సభలు సమావేశాలు జరగాల్సిన వేళ అంతా నిశ్శబ్దం నెలకొంది. ఇక కొద్ది గంటల్లో ప్రచారం ముగియనుండగా ఒక్క అభ్యర్థి కూడా ప్రత్యక్షంగా ఓటర్లను కలిసిన దాఖలాలు లేవు. ప్రధాన పోటీదారు టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో అడుగు పెట్టనే లేదు. బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ తమ పార్టీ ఓటర్లను కాపాడుకోవడానికి, కేవలం ప్రెస్మీట్లకు పరి మితం అయ్యారని, కాంగ్రెస్ అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ప్రచా రం జాడ ఎక్కడా కన్పించడం లేదనే ఆరోపణలున్నాయి. ఉ మ్మడి జిల్లాలో ఎక్కడా.. ఏ పార్టీకి సంబంధించిన మైకులు మోగడం లే దని, కనీసం ప్రచారం చేసే పరిస్థితి లేకుండా కేవలం క్యాంపు రా జకీయాలు చేస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం టీవీలు, పేపర్లు, సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం చేస్తున్నారని జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు.
కోడ్.. కొవిడ్ రూల్స్ మేరకే..
ఉమ్మడి జిల్లాలో ఎన్నికల కోలాహలం లేకున్నా.. అధికార యం త్రాంగం మాత్రం ఎలక్షన్ కోడ్, కొవిడ్ నిబంధనల మేరకు ము మ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. డబ్బు, మద్యం తరలకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన అధికారులు కొవిడ్ నిబంధనల మేరకు ఉమ్మడి జిల్లాలో పోలింగ్ కేంద్రాలను పెంచింది. గతంలో డివిజన్లోలాగా ఒక పోలింగ్ కేంద్రం కాకుండా ఈ సారి మండలానికో కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అలాగే పాజిటివ్గా నిర్ధారణ అయిన ఓటరు ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ వేయడం, లేదా పోలింగ్ చివరి 4 నుంచి 5 గంటల వరకు పోలింగ్ కేంద్రంలో ఓటు హ క్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు.
ఓటర్లు చేజారకుండా పార్టీల తిప్పలు..
మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నాటికి ఆయా పార్టీల బలాబలాలు ప్రస్తుతం తారుమారయ్యాయి. టీఆర్ఎస్ ఆకర్ష్ కు కాంగ్రెస్ ఇప్పటికే కుదేలై పోయింది. ఇక బీజేపీ తమ ఓటర్లు చేజారి పోకుండా వారిని క్యాంపునకు తరలించింది. అధికార పార్టీ సైతం పట్నం శివారులోని రిసార్టుల్లో క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ ఇప్పటికీ ఇతర పార్టీల క్యాంపుల్లో ఉన్న వారిని చేర్పించుకో వడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. సీనియర్లను రంగంలోకి దించి అభ్యర్థి జిల్లాలో కాలు పెట్టకుండానే వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటోంది. ఆదివారం రాత్రి వరకు బీజేపీ క్యాంపులో ఉన్న కార్పొరేటర్ తెల్లవారి టీఆర్ఎస్ లో చేరడం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. ఎన్నికల నాటికి తమ పార్టీ ఓటర్లు ఎంత మంది మిగులుతారు, ఎన్ని ఓట్లు వస్తాయి.. అని అంచనా వేసుకునే పరిస్థితి కాంగ్రెస్, బీజేపీ నాయకుల్లో నెలకొంది.
ఓటరు ఐడీ కార్డుల పంపిణీ..
నిజామాబాద్ రూరల్: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు అధికారులు ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. రూరల్ పరిధిలో గల సి రికొండ, డిచ్పల్లి, మోపాల్, ఇందల్వాయి, నిజామాబాద్ రూ రల్, దరిపెల్లి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులకు ఎంపీడీవోలు ఓటరు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ నెల 9 న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయని, అందుకు సంబంధించిన గుర్తిపు కార్డులు అందజేస్తున్నామని వారు తెలిపారు. ఓటరు కార్డు లేనిదే పోలింగ్ కేంద్రాలకు అనుమతించబడదని, కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఓటు హక్కు ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు గుర్తింపు కార్డులను సంబంధిత ఎంపీడీవో కార్యాలయాల నుంచి తీసుకోవాలని వారు సూచించారు.