నా కూతురు నడకతో మీకేంటి పని..? వారికి అభిషేక్ స్ట్రాంగ్ వార్నింగ్.. 

by Shyam |
నా కూతురు నడకతో మీకేంటి పని..? వారికి అభిషేక్ స్ట్రాంగ్ వార్నింగ్.. 
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ స్టార్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ నెటిజన్లపై సీరియస్ అయ్యాడు. తన ఫ్యామిలీ గురించి చాటుగా తప్పుడు కూతలు కూసే వాళ్ళు దమ్ముంటే తన ముందుకొచ్చి మాట్లాడాలంటూ సవాల్ విసిరాడు. బచ్చన్ ఫ్యామిలీ మాల్దీవులకు వెళ్లి తిరిగొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా ఇందులో ఆరాధ్య కాస్త వంకరగా నడుస్తూ కనిపించింది. దీంతో పెద్ద ఎత్తున చర్చకు దిగిన నెటిజన్లు.. పాప వాకింగ్ స్టైల్‌పై దారుణంగా ట్రోల్‌ చేశారు.

ఈ క్రమంలో తన అప్ కమింగ్ మూవీ ‘బాబ్‌ బిశ్వాస్‌’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న జూనియర్ బచ్చన్.. ఈ ట్రోల్స్‌పై స్పందించాడు. ‘నేను పబ్లిక్‌ ఫిగర్‌ని. నన్ను ఎంతైనా ట్రోల్‌ చేయండి. కానీ నా కూతురిని విమర్శించే హక్కు మీకు లేదు. దమ్ముంటే ఆ మాటలను నా ముందు అనండి. ఇంకెవరైనా అలా మాట్లాడితే ఊరుకునేది లేదు’ అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. కాగా అభిషేక్‌ ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించగా.. ఈ సినిమా కోసం 105 కిలోల బరువు పెరిగాడు.

https://www.instagram.com/reel/CWn4HBdqUnC/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story