- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూతురి కోసం అలా చేయాల్సి వచ్చింది : అభిషేక్
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌ల గారాల కూతురు ఆరాధ్య. తను సినిమా చూశాక అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నానని అంటున్నారు అభిషేక్. తన తండ్రి రొమాంటిక్ సీన్స్ లో నటించడం ఆరాధ్యకు ఇష్టం లేదట. అందుకే కొన్ని మంచి సినిమాలు వచ్చినా.. తనకు నచ్చని కారణంగా వదులుకున్నానని చెబుతున్నాడు అభిషేక్.
ఒకవేళ సినిమాలో రొమాన్స్ ఓవర్‌డోస్ ఉంటే.. అలాంటి సీన్లలో నటించనని దర్శక, నిర్మాతలకు ముందే చెప్పేవారట అభిషేక్. దీంతో వాళ్లు చాలాసార్లు మరో యాక్టర్‌ను చూసుకున్నారని చెప్పాడు. అయినా సరే మంచి చాన్స్ మిస్ చేసుకున్నాననే భావన తనలో ఎప్పుడూ కలగలేదన్నారు అభిషేక్. ఆరాధ్య రాకతో మా జీవితాల్లో కొత్త ఆనందం వచ్చిందని.. తనను బాధించే పని ఏదీ కూడా తాను చేయబోనని అన్నారు.
కాగా అభిషేక్ నటించిన ‘బాబ్ బిశ్వాస్, లుడో, ది బిగ్ బుల్’ చిత్రాలు ప్రస్తుతం రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. అభిషేక్, నిత్యామీనన్ కలయికలో తెరకెక్కిన ‘బ్రీత్ : ఇన్ టు ది షాడోస్’ సిరీస్ జులై 1న అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. కూతురు కిడ్నాప్ నేపథ్యంలో సాగే కథలో డాక్టర్‌గా కనిపించనున్నాడు అభిషేక్.