మావోయిస్టు అగ్రనేతల అరెస్ట్

by Aamani |
Abhay, Vijayalakshmi
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా సోమవారం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వారణాసి సుబ్రహ్మణ్యం అలియాస్ అభయ్‌ను మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను రామగుండం సీపీ సత్యనారాయణ వెల్లడించారు. మంచిర్యాల క్యాతనపల్లిలో నివసిస్తున్న గురిజాల రవీందర్ రావు ఇల్లు తనిఖీ చేయగా.. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా మావోయిస్టులను పట్టుకున్నారు. రవీందర్రావు ఇంటికి అభయ్, అతని భార్య విజయలక్ష్మి వచ్చి 20 రోజులు అతని ఇంట్లో ఉండి కోల్ బెల్ట్ ఏరియాలో సింగరేణి కార్మిక సమాఖ్య ఆర్గనైజేషన్‌‌తో సమావేశం జరిపారు. అంతేగాకుండా వారు ప్రతిరోజూ సికాస నాయకులను, కార్యకర్తలను కలిసి సికాస అభివృద్ధికి కృషిచేశారు. అయితే విషయం తెలసుకున్న పోలీసులు, ఈ రెండ్రోజుల్లో మళ్లీ రవీందర్రావు ఇంటికి అభయ్, అతని భార్య విజయలక్ష్మి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నదని నమ్మి, పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ నెల 21న సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలో భార్యాభర్తలిద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించినట్టు తెలిపారు.

వారణాసి సుబ్రహ్మణ్యం @శ్రీకాంత్ @అమన్ @విమల్, S/o B.లక్ష్మినారయణ శాస్త్రి, R/o మార్కాపురం, ప్రకాశం జిల్లా, ఇతను Ex CCM CPI మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ అయిన సికాసలో 1980లలో పాత ఆదిలాబాద్ జిల్లాలో పని చేశాడు. ఆ తర్వాత 2004లో సీపీఐ మావోయిస్టు పార్టీ ఏర్పాటులో కీలకంగా పనిచేసి, సెంట్రల్ కమిటీ మెంబర్ వరకూ ఎదిగాడు. అంతేగాకుండా సీపీఐ మావోయిస్టు పార్టీ నార్త్ రీజినల్ బ్యూరోలో ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా హర్యానా పంజాబ్ ఢిల్లీ ప్రాంతాలలో పనిచేస్తూ 2011లో బీహార్‌లో అరెస్టయ్యాడు. ఆ తర్వాత 2019లో బెయిలుపై వచ్చి, వెంటనే మళ్లీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కలిసి వారి సూచన మేరకు కోల్ బెల్ట్ ఏరియాలో సికాస పార్టీని పునర్ నిర్మాణం చేసి పూర్వవైభవం తీసుకురావడానికి కృషిచేశాడు. అందులో భాగంగా మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో తన పూర్వ సహచరుడైన గురిజాల రవీందర్రావు ఇంటికి నవంబర్ 2020లో తన భార్యతో వచ్చి 20 రోజులు ఉండి కోల్ బెల్ట్ ఏరియాలో తిరుగుతూ పార్టీ పూర్వ కార్యకర్తలతో సమావేశాలు జరిపి వెళ్ళిపోయాడు. ఉత్తర భారత దేశంలో పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నాడు.

విజయలక్ష్మి @శ్రీధర W/o వారణాసి సుబ్రహ్మణ్యం, CPI మావోయిస్టు DCM ఢిల్లీ సిటీ కమిటీ బెంగళూరుకు చెందిన ఈమె 1990లో బ్యాంక్ ఆఫ్ మైసూర్‌లో పనిచేస్తూ వారణాసి సుబ్రహ్మణ్యంను పెళ్లి చేసుకున్నది. తరువాత 1996లో వీఆర్ఎస్ తీసుకుని వారణాసి సుబ్రహ్మణ్యంతోపాటు పార్టీలో పనిచేస్తూ ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా ఢిల్లీకి కమిటీలో పని చేసింది. 2011లో సుబ్రహ్మణ్యం అరెస్టయిన వెంటనే పార్టీ సూచన మేరకు షెల్టర్లు మారుస్తూ వివిధ ప్రదేశాలలో DENలను నిర్వహించింది. 2019లో సుబ్రహ్మణ్యం బెయిల్‌పై వచ్చిన తరువాత పార్టీ నిర్ణయం మేరకు 2020 జనవరిలో వారణాసి సుబ్రహ్మణ్యం కలిసి అతనితో పాటు కార్యకలాపాలలో పాలు పంచుకుంటూ నవంబర్ 2020లో క్యాతనపల్లి గ్రామంలో గురజాల రవీందర్రావు ఇంటికి వచ్చింది. దాదాపు 20 రోజులు ఉండి పార్టీ కార్యకలాపాలలో తన భర్తతో సహా పాల్గొని సికాస పార్టీని పునర్నిర్మాణానికి తనవంతు కృషి చేసింది. కాగా, ఈ ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నామని సీపీ వెల్లడించారు.

సుబ్రహ్మణ్యం నుంచి రికవరీ చేసిన వస్తువులు..
1.HP Laptop
2.Samsung Mobile (A10 Model)
3.Micro Card – 2

విజయలక్ష్మి నుంచి రికవరీ చేసిన వస్తువులు
1.Mobile – Samsung
2.A10s Model
3.Nokia

మొత్తం రికవరీ చేసుకున్న వస్తువులు
1.PARTY PROGRAMME 23 PAGES.
2.POLITICAL RESOLUTION 54 PAGES
3.అమరావీరులకి జోహార్లు 37 PAGES.
4.RESOLUTION OF THE 6th CCM 12 PAGES
5.దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తీర్మానాలు 38 PAGES
6.DKSZC SECRETAIAT RESOLUTIONS 40 PAGES
7.మన పార్టీ 50 వ వార్సికోత్శావాలకి విప్లవ జేజేలు 19 PAGES
8.Revolutionary greetings to the fiftieth Anniversary of Our Party 20 pages
09.సి సి 1 వ సమావేశం తీర్మానాలు 2017 ఫిబ్రవరి 46 PAGES
10.C C 5th Conference Resolutions February 2017 32 PAGES
11.పత్రిక రంగంపై సమీక్ష నిర్ణయం 03 PAGES
12.Central Committee (P) CPI (Maoist) 114 pages
13.Communist Party of India (Maoist) Central Committee 03 PAGES
14.భారత కమ్యునిస్ట్ పార్టీ ( మావోయిస్టు) కేంద్ర కమిటీ పత్రిక ప్రకటన నవంబెర్ 2018 03 PAGES

1.మార్క్స్ ఎంగెల్స్ ల రచనల సంక్షిప్త పరిచయం – 20 Pages
2.మార్క్స్ ఎంగెల్స్ ల రచనల సంక్షిప్త పరిచయం – 36 Pages
3.Chapter Part 2 Google Corrections done 15.02.21 8:30 AM – 30 Pages
4.Emergence of Modern Industrial works class – 13 Pages
5. Workers in Iron and Steel Factories – 7 Pages
6.Workers in Jute Factories – 11 Pages
7. డేవిడ్ హర్యే : పెట్టుబడి ఏడూ ప్రాధమిక వైరుధ్యాలు – ఒక విశ్లేషణాత్మక పరిచయం – 44 Pages
8.పెట్టుబడిదారి ఉత్పత్తి – శ్రమ దోపిడి – మార్కెట్ సంక్షోభం – 21 Pages
9.మార్క్స్ ఎంగెల్స్ ల రచనల సంక్షిప్త పరిచయం – 32 Pages
10.భారతదేశంలో భూస్వామ్య విధానం ఉందా ? – 32 Pages
11.Economic & Philosophic Manuscripts of 1844 – 81 Pages
12.Need a serious research to Fight dogmas – 110 Pages

BOOKS

1.From Marx to MaoTSE Tung -1
2.Baba Bujho Singh AN untold story – 1
3.The Making of Varavara Rao – 1
4.అనురాధ గాంధీ భారతదేశం లో కుల సమస్య – 1
5.భారత ఆర్ధిక వ్యవస్థ 1857 – 2017

సీపీ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో డీసీపీ మంచిర్యాల ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ బెల్లంపల్లి రహెమాన్ పాల్గొన్నారు.

Advertisement

Next Story