- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య, అప్‌డేట్స్‌ను ప్రజలకు అందించేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ‘ఆరోగ్యసేతు’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగులు దీనిని డౌన్‌లోడ్ చేసుకోవడాన్ని భారత్‌లో తప్పనిసరి చేశారు. ఇప్పటికే ఈ యాప్‌ను 11.2 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ వల్ల డేటా భద్రత సమస్యలున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొందరు యూజర్లు, నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్య సేతు యాప్‌ను పూర్తిగా ఓపెన్‌సోర్స్ ప్లాట్‌ఫాంగా అభివృద్ధి చేశారు. ఈ క్రమంలోనే వైరస్ ట్రేసింగ్ యాప్‌లో ఏవైనా బగ్స్ కానీ, లోపాలను కానీ గుర్తిస్తే.. వారికి నగదు రివార్డు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఆరోగ్య సేతు యాప్ సోర్స్ కోడ్‌ను పబ్లిక్ చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్వాగతించారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఓఎస్‌కు సంబంధించిన ఆరోగ్య సేతు యాప్‌ను మాత్రమే ఓపెన్ సోర్స్ చేశారు. మరో రెండు వారాల్లో ఐఓఎస్ వర్షన్ అప్లికేషన్‌ను కూడా ఓపెన్ సోర్స్ చేస్తామని కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నవారిలో 98 శాతం ఆండ్రాయిడ్ ఓఎస్ వాడుతున్నవాళ్లే ఉన్నారు. ఆరోగ్య సేతు యాప్‌లోని మూడు సెక్యూరిటీ ఇష్యూస్ అంశాలకు సంబంధించి బగ్స్ కనిపెట్టి చెప్పినవారికి రూ లక్ష చొప్పున, మొత్తంగా రూ.3 లక్షల రివార్డ్ ఇవ్వనున్నట్లు నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్ డైరెక్టర్ నీతా వర్మ ప్రకటించారు. కోడ్ బెటర్‌మెంట్ చేసిన వారికి కూడా రివార్డ్ ఇస్తామన్నారు. డెవలపర్స్, రీసెర్చర్స్ సోర్స్ కోడ్‌ను ఇన్స్‌పెక్ట్ చేసి చేంజెస్ చెప్పవచ్చునని, రివ్యూస్ కూడా ఇవ్వొచ్చని తెలిపారు. అందుకోసం : https://github.com/nic-delhi/AarogyaSetu_Android.git సైట్‌ను విజిట్ చేయమన్నారు. గవర్నెమెంట్‌కు చెందిన యాప్స్‌లలో బగ్స్ కనిపెడితే రివార్డ్‌లు అందిస్తున్న తొలి యాప్ ఇదేనన్నారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఈ పాస్ జారీ చేస్తే అది ఈ యాప్‌తో అనుసంధానం అవుతుందని, ప్రత్యేకంగా కాపీ పట్టుకెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు.