ఆరోగ్యసేతులో న్యూ ఫీచర్.. డబుల్ డోస్.. డబుల్ టిక్స్

by sudharani |
ఆరోగ్యసేతులో న్యూ ఫీచర్.. డబుల్ డోస్.. డబుల్ టిక్స్
X

దిశ, ఫీచర్స్ : వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ‘ఆరోగ్య సేతు’ యాప్ వినియోగదారుల కోసం న్యూ ఫీచర్ తీసుకొచ్చింది. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్లయితే, అప్పుడు యాప్‌ హోమ్ స్క్రీన్ డబుల్ బార్డర్‌ను చూపడంతో పాటు, ఆరోగ్య సేతు లోగోలో రెండు బ్లూ టిక్స్ డిస్ ప్లే చేస్తుంది.

ఆరోగ్య సేతు ప్లాట్‌ఫామ్‌లో మీ టీకా స్థితిని అప్‌డేట్ చేసిన తర్వాత, మీరు రెండు టీకాలు తీసుకుంటే బ్లూ బార్డర్ చూపిస్తుంది. అది ఒకే మోతాదు వ్యాక్సిన్ మాత్రమే తీసుకున్న వారికి హోమ్ స్క్రీన్‌పై ‘పార్షియల్లీ వ్యాక్సినేటెడ్’ స్టేటస్‌తో పాటు ఒకే టిక్‌తో ఆరోగ్య సేతు లోగో డిస్ ప్లే అవుతుంది. సింగిల్ లైన్ బ్లూ బార్డర్ చూపుతుంది. కొవిన్ పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ నుండి టీకా స్థితి ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీరు బ్లూ టిక్ లేదా షీల్డ్‌ను నోటీస్ చేస్తారు.

ఆరోగ్య సేతు యాప్‌లో టీకా స్టేటస్‌ను ఎలా అప్‌డేట్ చేయాలి?
* యాప్‌లో మీరు లాగిన్ అయిన తర్వాత, స్క్రీన్‌పై ‘అపడేట్ వ్యాక్సినేషన్ స్టేటస్’ బటన్‌ను మీరు గమనించవచ్చు. దానిపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను మళ్లీ నమోదు చేయండి.
* ఆ నెంబర్‌కు OTP వస్తుంది. దాన్ని నమోదు చేయగానే వెరిఫై అవుతుంది.
* మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ధృవీకరించన తర్వాత, యాప్‌లో ప్రొఫైల్స్ జాబితా కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే, టీకా స్టేటస్ కొవిన్ బ్యాకెండ్ నుండి నిర్ధారణ అవడంతో పాటు, ఆరోగ్య సేతు యాప్‌లో కూడా అప్‌డేట్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed