- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశ రాజధానిలో కమలం కకావికలం
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. సుమారు గడిచిన పదిహేనేళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) లో ఎదురులేకుండా పరిపాలిస్తున్న బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐదు వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాలుగు స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకుంది. షాలీమార్ భాగ్ నార్త్, కళ్యాణ్‌పురి, త్రిలోక్‌పురి, రోహిణి-సి, చౌహాన్ బాంగర్ లో ఎన్నికలు జరిగాయి. చౌహాన్ బాంగర్‌లో మినహాయించి నాలుగు స్థానాల్లో ఆప్ అభ్యర్థులే విజయం సాధించారు.
కాగా.. ఈ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీ మున్సిపాలిటీలో ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని ఈ విజయం ద్వారా స్పష్టమవుతున్నదని.. త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ కూడా గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.