- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్లాక్ ఫంగస్‌తో కొత్తగూడెం వాసి మృతి
దిశ, స్టేషన్ ఘనపూర్ ; బ్లాక్ ఫంగస్ బారినపడి చికిత్స పొందుతూ ఆలేటి నర్సిరెడ్డి(55) మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మంగలి బండ తండ శివారు కొత్తగూడెంలో బుధవారం వెలుగుచూసింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కొత్తగూడెంనకు చెందిన ఆలేటి నర్సిరెడ్డి ఇటీవలె కరోనా బారిన పడి చికిత్స అనంతరం ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు.
ఆ తర్వాత అతనికి తీవ్రమైన తలనొప్పి, దవడ నొప్పి రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు తేలింది. చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారం రోజులుగా చికిత్స పొందుతున్న నర్సిరెడ్డి పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. నర్సిరెడ్డి మృతితో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.