- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిరపలో నల్ల తామరపై జడ్పీలో గళమెత్తిన ఆకుల శ్రీనివాస్.
దిశ, దుగ్గొండి: వరంగల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్, దుగ్గొండి మండల జడ్పీటీసీ ఆకుల శ్రీనివాస్ మిరప రైతుల ఇబ్బందులపై ఉద్యానవన అధికారులను ప్రశ్నించారు. మిరప పంటకు ఎన్నడూ లేని విధంగా నల్ల తామర పురుగు సోకడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నల్ల తామర పురుగు నివారణ చర్యల కోసం నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని శాస్త్రవేత్తలను పిలిపించి పరిశోధన చేయించారన్నారు. అయితే అధికారులు ఎన్ని గ్రామాల్లో పర్యటించారు..? తామర పురుగు నివారణ చర్యల్లో భాగంగా ఎంత మంది రైతులకు భరోసా కల్పించారో వివరాలు వెల్లడించాలని.. ఉద్యానవన అధికారులను ప్రశ్నించారు.
లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో కన్నీటి పర్యంతమవుతూ.. రైతులు తమ పంటలను నేలలో కలియ దున్నుతున్నారన్నారు. కష్టాలలో ఉన్న రైతులకు భరోసా కల్పించి వారికి పంట తెగులుపై అవగాహన కల్పించాల్సిన అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతూ క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం పై ఆకుల శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
- Tags
- Chilli crop