'రైనా.. నీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకో'

by Shiva |
రైనా.. నీ రిటైర్మెంట్ వెనక్కి తీసుకో
X

దిశ, స్పోర్ట్స్ : టీం ఇండియా క్రికెటర్ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌ (International Cricket)కు వీడ్కోలు చెబుతున్నట్లు అగస్టు 15న ప్రకటించిన సంగతి తెలిసిందే. టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ తన అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్ బై చెప్పిన కొద్ది సేపటికే రైనా కూడా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. టీమ్ ఇండియాలో ప్రాణ స్నేహితుల్లో మెలిగే వీరిద్దరూ ముందుగానే అనుకొని తమ నిర్ణయాన్ని ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి.

అయితే ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా (Commentator Aakash Chopra).. రైనా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాడు. వెంటనే అతను అఫ్రీదిలా రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని క్రికెట్ ఆడాలని కోరాడు. రైనా నిర్ణయం ఒక తొందరపాటు చర్య అని, అతడికి ఇంకా 32 ఏళ్లే.. ఇంకా కొద్ది కాలం క్రికెట్ ఆడే అవకాశం ఉండగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అర్థం కావడం లేదని చోప్రా అభిప్రాయపడ్డాడు.

తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన ఆకాశ్ చోప్రా.. ‘‘సురేశ్ రైనా ఇప్పటికే చాలా క్రికెట్ ఆడి ఉండొచ్చు. కానీ రిటైర్మెంట్ ప్రకటించాల్సిన అవసరమైతే అతనికి ఇప్పుడు లేదు. గతంలో కొన్ని గాయాలతో సతమతమతమయ్యాడు. కానీ ప్రస్తుతం అదేం పెద్ద సమస్య కాదు. ఏ ఆటగాడు గాయాల సమస్యలు లేకుండా ఉన్నాడు? రైనా గతంలో సర్జరీ కూడా చేయించుకున్నాడు.. ప్రస్తుతం ఫిట్‌గా, మెరుగ్గానే ఉన్నాడు. కాబట్టి ఇంకా కొన్ని రోజులు క్రికెట్ ఆడాల్సి ఉంది ‘ అని ఆకాశ్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed