నిత్య పెళ్లి కూతురు.. యువతి మూడో పెళ్లిని బయటపెట్టిన ఆధార్ కార్డ్!

by Anukaran |
Fake Marrege1
X

దిశ, వెబ్‌డెస్క్ : నేను అనాథను.. ఇద్దరం ఓకే కంపెనీలో పని చేస్తున్నాం.. పెళ్లి చేసుకుందాం.. అంటూ ఓ యువతి మాయమాటలతో తోటి ఉద్యోగైన యువకుడిని మోసం చేసింది. ప్రేమ, పెళ్లి పేరిట అతడిని వంచించి.. రూ. 6 లక్షలు తీసుకుని పరారీ అయింది. అప్పటికే ఇద్దరిని వివాహమాడిన ఆ కిలాడీ లేడి.. ముచ్చటగా మూడో వ్యక్తిని మోసం చేసి జంప్ అయింది. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుపతి సమీపంలోని విజయపురానికి చెందిన ఓ యువకుడు స్థానికంగా ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇటీవల అదే కంపెనీలో సుహాసిని అనే యువతి ఉద్యోగంలో చేరింది. తనది నెల్లూరు.. ఓ అనాథ అని సదరు యువకుడితో పరిచయం పెంచుకుంది. అలా అతడిని ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని మాయమాటలతో బూరిడీ కొట్టించింది. అవ్వేం తెలియని యువకుడు తోటి ఉద్యోగి, అనాథ అనే జాలితో ఆమె మాటలు నమ్మి పెళ్లికి ఓకే చెప్పేశాడు. కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

Suhasini

అయితే సుహాసిని వివిధ ఖర్చుల పేరిట భర్త.. ఆమె అత్తమామల వద్ద నుంచి రూ.6 లక్షల తీసుకుంది. తనను పెంచిన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అయితే ఆమె ఆధార్ కార్డును అత్తగారి ఇంట్లోనే వదిలేసి వెళ్లడంతో దానిని పరిశీలించిన భర్తకు షాకింగ్ విషయాలు తెలిశాయి. సుహాసిని అప్పటికే ఇద్దరు వ్యక్తులను పెళ్లి చేసుకుందని, మొదటి భర్తతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిందని తేలింది.

సుహాసిని వ్యవహారంపై కూపీ లాగిన భర్తకు మరికొన్ని విషయాలు తెలిశాయి. ప్రేమ, పెళ్లి పేరుతో ఇలాగే మోసం చేసి డబ్బులు తీసుకుని పరారీ అవుతుందని తెలిసింది. దీనిపై సుహాసినికి ఫోన్ చేసి నిలదీయగా.. మూడో భర్తకు షాక్ ఇచ్చింది. తన గురించి ఎక్కడైన చెప్పినా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రివర్స్ కేసు పెడతానని బెదిరింది. దీంతో ఖంగుతిన్న భర్త.. తిరుపతి అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడు ఆరోపణలు అన్నీ నిజమేనని తేల్చారు.

Marrege3

ప్రస్తుతం సుహాసిని హైదరాబాద్‌లో మకాం వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె కోసం ఓ బృందం హైదరాబాద్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, వారం రోజుల క్రితమే విజయవాడతో ఓ మహిళ ఇదే తరహాలో మోసాలకు పాల్పడి డబ్బులు వసూలు చేసిన ఘటన మరవకముందే తిరుపతి ఘటన బయట పడడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed