- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
19 మంది భర్తలకు ఒక్కతే భార్య.. రూ.2.28 కోట్ల కట్నం..
దిశ, వెబ్‌డెస్క్ : అందం, ఆకర్షణీయమైన శరీరం, చలాకీ తనం.. కాస్త మాట్లాడే నేర్పు ఉంటే చాలు.. అవతలి వారిని అవలీలగా మోసం చేయవచ్చని భావిస్తున్నారు కొందరు యువతులు. తన మాటలతో మత్తుజల్లుతూ.. అందంతో మాయ చేస్తూ బుట్టలో వేసుకుంటున్నారు. అవతలి వ్యక్తి ఆమె మైకంలోకి వెళ్లగానే అందినకాడికి దండుకుని జంప్ అవుతున్నారు. ఇలాంటి ఘటనే చైనాలో జరిగింది. మ్యారేజ్ బ్యూరో ద్వారా ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహమాడి 19 మందిని మోసం చేసింది ఓ నిత్య పెళ్లికూతురు. చివరి భర్త ఫిర్యాదుతో ఆమె బాగోతం బయటపడింది.
మంగోలియాలోని బయాన్నూర్‌కు చెందిన ఓ వ్యక్తికి 35 ఏళ్లు దాటినా వివాహం కాలేదు. కుటుంబ సభ్యులు, బంధువుల బలవంతంతో ఓ మ్యారేజ్ బ్యూరోని సంప్రదించి మంచి అమ్మాయిని చూడాలని కోరాడు. అప్పటికే ఆ మ్యారేజ్ బ్యూరోలో వివరాలు నమోదు చేసుకున్న ఓ యువతి ప్రొఫైల్‌ను సదరు వ్యక్తికి ఇచ్చాడు బ్యూరో నిర్వాహకుడు. ఆ యువతి నచ్చడంతో వివాహానికి ఓకే చెప్పాడు యువకుడు.
పెళ్లికి ఆ యువతి కూడా అంగీకరించడంతో ఇద్దరు తరచూ ఫోన్లలో మాట్లాడుకునే వారు. నెల రోజుల్లో వివాహం చేసుకుందామని ఒప్పందం చేసుకున్నారు. అయితే వరుడికి వయసు ఎక్కువగా ఉన్నందున తనకు రూ.16.9 లక్షలు (148,000 యువాన్ల) కట్నం కావాలని సదరు యువతి కోరింది. అప్పటికే పెళ్లి చేసుకోవడం ఆలస్యం అవుతుందని భావించిన వరుడి కుటుంబ సభ్యులు ఆమె అడిగిన మొత్తాన్ని ఇచ్చి వివాహం చేశారు.
పెళ్లి తంతు ముగిసిన అనంతరం కొద్ది రోజులు కాపురం చేసిన యువతి రిజిస్ట్రేషన్ కోసమని తన పుట్టింటకని వెళ్లింది. ఆమె వెళ్లిన తర్వాత సోషల్ మీడియాలో ఆమె పెళ్లికి సంబంధించిన ఓ వీడియో భర్త కంటపడింది. అది చూసిన ఆయన ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఆచూకీ తెలుసుకుని వివాహం గురించి ఎంక్వేరి చేయగా అతడిని కూడా వివాహం చేసుకున్నట్లు తేలింది. దీనిపై తాజా భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేయగా.. షాకింగ్ విషయాలు తెలిశాయి.
ఆమె తన ప్రొఫైల్ ను మ్యారేజ్ బ్యూరోల్లో పెడుతూ అలా 19 మందిని వివాహం చేసుకున్నట్లు తేలింది. అలాగే సదరు వ్యక్తుల నుంచి కట్నంగా రూ.2.28 కోట్ల వరకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిపింది. ఆమెకు బంధువులుగా వ్యవహరిస్తున్న మరో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉంది.