కాలినడకన వెళ్లి సోనూసూద్‌ని కలిసిన కోదాడ యువకుడు

by Shyam |
కాలినడకన వెళ్లి సోనూసూద్‌ని కలిసిన కోదాడ యువకుడు
X

దిశ, కోదాడ: అభిమాన నటుడిని కలవాలనే ఆకాంక్ష, పట్టుదల అతన్ని వందలాది కిలోమీటర్ల దూరాన్ని దగ్గర చేశాయి. కరోనా కష్ట కాలంలో వేలాది మందికి సహాయం చేసి ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు సాధించిన సినీ నటుడు సోనుసూద్‌ను కలవాలని, కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండకు చెందిన దేవపంగు ఇంద్ర కుమార్ హైదరాబాద్ నుండి ముంబై కి కాలినడకన పయనమయ్యాడు. వందలాది కిలోమీటర్ల దూరాన్ని సినీనటుడుపై ఉన్న అభిమానం అతని విజేతగా నిలిపింది. ఇంద్ర కుమార్ ముంబైలో బుధవారం సోనూసూద్ ని కలిశాడు.

ఇదే సందర్భంలో తాను రాసిన పాటలు సోను సూద్ ద్వారా విడుదల చేయించి తనకున్న అపార అభిమానాన్ని, ప్రేమను చాటుకున్నాడు. తనపై ఉన్న అభిమానంతో వందలాది కిలోమీటర్లు కాలినడకన వచ్చిన గాయకుడు ఇంద్ర కుమార్ సోను సూద్ అభినందించారు. కాగా కొమరబండ నుండి ఓ సామాన్య యువకుడు సాహసం చేసి కాలినడకన ముంబై వెళ్లి సోనూసూద్ ని కలిసి అభినందనలు పొందడం పట్ల కొమరబండ వాసులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందించారు.

Advertisement

Next Story