యువతిపై గొడ్డలితో దాడి చేసిన రాహుల్

by Sumithra |
యువతిపై గొడ్డలితో దాడి చేసిన రాహుల్
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో ఉన్మాది రెచ్చిపోయాడు. మంగళవారం మీర్‌పేట గుర్రంగూడ టీచర్స్‌కాలనీలో ఓయువతిపై రాహుల్‌గౌడ్ అనే యువకుడు గొడ్డలితో దాడి చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న యువతిని స్థానికులు, కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న యువతిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం నాలుగు పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. గతంలో ప్రేమ విషయంలో జైలుకు పంపించిందనే కారణంతోనే దాడికి పాల్పడ్డాడని స్థానికులు అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story