- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యాయం చేస్తారా? నన్ను దూకమంటారా?
X
దిశ,మహేశ్వరం: తనకు న్యాయం కావాలంటూ హై టెన్షన్ ఫోల్ ( విద్యుత్ టవర్ ) ఎక్కి హల్చల్ చేసాడు ఒక యువకుడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దెబ్బడగూడ గ్రామానికి చెందిన డేరంగుల రాజు వ్యవసాయ భూమిని పండిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే గత కొద్దిరోజుల క్రితం తన భూమిని కొంతమంది వ్యక్తులు కుట్ర పూరితంగా తీసుకున్నారు. ఈ విషయమై ఎంతమంది అధికారుల వద్దకు వెళ్లినా అక్కడ అతనికికి చుక్కెదురయింది. దీంతో తన భూమిని వారి వద్ద నుండి విడిపించుకోవడానికి విద్యుత్ టవర్ ఎక్కి సుమారు 2 గంటల పాటు నిరసన తెలిపాడు. భూమి లేకపోతే తనకు జీవనం లేదని, తన భూమిని వారి వద్ద నుండి విడిపించేవరకు దిగిరానని మొండికేసాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యువకుడికి న్యాయం చేస్తామని సర్ది చెప్పి కిందకు దింపారు.
Advertisement
Next Story