కుర్రాడితో ఆంటీ ఎఫైర్.. చిచ్చుపెట్టిన ఇద్దరబ్బాయిలు.. అసలు ట్విస్ట్ అదే

by Sumithra |   ( Updated:2021-05-13 04:21:11.0  )
కుర్రాడితో ఆంటీ ఎఫైర్.. చిచ్చుపెట్టిన ఇద్దరబ్బాయిలు.. అసలు ట్విస్ట్ అదే
X

దిశ, వెబ్‌డెస్క్ : వారిది ఎంతో అందమైన కాపురం.. బంగారంలా చూసుకొనే భర్త, కడిగిన ముత్యం లాంటి మూడేళ్ళ కుమార్తె.. చిన్న కుటుంబం.. ఇంత అందమైన కుటుంబాన్ని వదిలి పక్కింటి కుర్రాడిపై మోజుపడింది ఆ మహిళ.. అతడితో వివాహేతర సంబంధం పెట్టుకొని రోజూ భర్తలేని సమయంలో కుర్రాడితో కామ క్రీడలు సాగించింది. కానీ.. చివరికి ఆ వివాహేతర సంబంధమే ఆమె ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరమకుడి సమీపంలోని సెల్లూర్ గ్రామానికి చెందిన విమల్ రాజ్ (30)కు, కొటై గ్రామానికి చెందిన రేష్మ (23)కు నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఒక కుమార్తె. అయితే రేష్మ పక్కింటి కుర్రాడి ట్రాప్ లో పడింది. భర్త లేని సమయంలో వారింట్లోనే పక్కింటి కుర్రాడితో కలిసి రాసలీలలు నడపడం మొదలుపెట్టింది. అయితే ఒకరోజు వీరిద్దరూ ఉన్నప్పుడు భర్త రావడంతో పక్కింటి కుర్రాడిని వెనుక గుమ్మం నుండి బయటికి పంపించేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలయ్యింది.. కుర్రాడైతే తప్పించుకున్నాడు కానీ అక్కడ ఆ సీన్ చూసిన మరో ఇద్దరు ఆకతాయిలకు రేష్మ అడ్డంగా బుక్కయింది.

ఇక అప్పటినుండి ఆకతాయిలు సైతం మా కోరిక కూడా తీర్చాలని, లేకపోతే మీ ఇద్దరి విషయం ని భర్తకు చెబుతామని బెదిరించడం మొదలుపెట్టారు. అయినా రేష్మ ఒప్పుకోలేదు. దీంతో సదరు యువకులు ఓ రోజు రేష్మ భర్త విమల్ రాజ్ కి మద్యం తాగించి మొత్తం విషయం చెప్పారు. ఇక అప్పటినుండి భర్త, రేష్మను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో భర్త టార్చర్ భరించలేక రేష్మ ఆత్మహత్య చేసుకొంది. తన చావుకు కారణం.. పక్కింటి కుర్రాడు బాలమురుగన్ ముత్తుకుమారే కారణనమని డెత్ నోట్ రాసిపెట్టి రేష్మా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Next Story