- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
40 ఏళ్లకే 44 మంది పిల్లలను కన్న మహిళ.. ఇక చాలు.. ఆపమన్న ప్రభుత్వం
దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమా చూసినవారందరికి ఆ సినిమా క్లైమాక్స్ గుర్తుండే ఉంటుంది. ఆరేళ్లలో ఏకంగా 13మంది పిల్లలను కన్న పేరెంట్స్ గా పవన్ కళ్యాణ్, భూమిక లని ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఇక ఈ సీన్ చూసినవారందరు వామ్మో.. అంతమంది పిల్లలను చూసుకోవడం కష్టమేగా.. అని నోళ్లు నొక్కుకున్నారు. అయితే.. 40 ఏళ్ల వయస్సుకే 44 మంది పిల్లలను కన్న ఈమె గురించి వింటే.. కళ్లు తిరిగిపడాల్సిందే.. ఇంకా విచిత్రం ఏంటంటే.. దయచేసి ఇంకా పిల్లల్ని కనవద్దని ఆమెకు ప్రభుత్వం లేఖ రాసింది కూడా. ప్రభుత్వ ఆదేశాలకు తలవొగ్గి ఆమె పిల్లల్ని కనడం ఆపేసింది. అయితే 40 ఏళ్ల వయస్సులో 44 మందిని ఎలా కనేసింది..? వినడానికే విడ్డురంగా ఉన్న ఆమె కథ గురించి తెలుసుకుందాం.
ఉగాండాకు చెందిన 40 ఏళ్ల మరియంకు 12 ఏళ్లకే పెళ్లి జరిగింది. 13వ ఏటే ఆమెకు కవల పిల్లలు జన్మించారు. దీంతో ఆమె వైద్యులను సంప్రదించి గర్భ నివారణ చేయాలని కోరింది. ఈ సందర్భంగా ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు అది సాధ్యం కాదని చెప్పారు. పైగా ఆమె అండాశయాలు చాలా పెద్దవని, భవిష్యత్తు లో మరింత మంది కవలలు పుట్టే అవకాశం ఉందన్నారు. చివరికి వైద్యులు చెప్పినట్లే జరిగింది. ఆమె గర్భాశయం లో ఒకేసారి అనేక అండాలు విడుదల కావడం వల్ల ఆమెకు ఒకేసారి ఇద్దరు నుంచి నలుగురు పిల్లలు చొప్పున జన్మించారు. తొలి కాన్పులో కవలలకు జన్మనిచ్చిన ఆమె.. ఆ తర్వాత ఆరు కాన్పుల్లో కవలలను, నాలుగు కాన్పుల్లో ముగ్గురేసి చొప్పున, మూడు కాన్పుల్లో నలుగురేసి పిల్లలకు, రెండు కాన్పుల్లో ఒకరేసి చొప్పున మొత్తం 44 మందికి ఆమె జన్మనిచ్చింది. వీరిలో ఆరుగురు పిల్లలు పుట్టగానే చనిపోవడంతో ప్రస్తుతం 38 పిల్లలే ఉన్నారు.
ఇక మూడేళ్ల కిందట మరియం భర్త ఆమెను వదిలేశాడు. దీంతో ఆ 38 మంది పిల్లలను పోషించే బాధ్యత ఆమెపైనే పడింది. వారిని పోషించడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్నానని తెలిపింది. మళ్లీ గర్భం దాల్చితే తన ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారని, తన గర్భాశయం తొలగించడం అంత సులభమైన పని కాదని వైద్యులు చెప్పారని తెలిపింది. ఇక ఆ 38 పిల్లలను ఆమె ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. స్కూల్‌కు పంపి చదివిస్తోంది.
తన పిల్లలను ఉన్నత చదువులు చదివించడానికి ప్రభుత్వం తనకు సాయం చేయాలని కోరగా.. ఇకపై పిల్లలను కనకూడదనే షరతుతో ప్రభుత్వం ఆమెకు సాయం చేయడానికి ముందుకొచ్చింది. ప్రపంచంలో అత్యంత పేదరికాన్ని అనుభవిస్తున్న దేశాల్లో ఉగాండా కూడా ఒకటి.. అలాంటి దేశంలో మరియం లాంటి వాళ్లు ఇద్దరు ఉన్నా ఆ దేశం ఇంకా పేదరికంలోకి కూరుకుపోవడం ఖాయమంటున్నారు నెటిజన్లు.