- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చనిపోతారని కవలల్ని వదిలేసి వెళ్లిన తల్లి
దిశ, కోదాడ: నవ మాసాలు మోసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఓ తల్లి.. తన నవ శిశువులను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లి పోయింది. మాతృత్వానికి మచ్చ తెచ్చే ఈ ఘటన కోదాడ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…కోదాడ మండలం గణపవరం గ్రామానికి చెందిన ఆరోగ్య అనే మహిళ.. డెలివరీ కోసం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆమె కవల ఆడ పిల్లలకు జన్మనిచ్చింది.
ఈ విషయం తెలిసిన కుటంబ సభ్యులు ఉదయం ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే ఆ పిల్లల ఆరోగ్యం బాగా లేకపోవడంతో వారిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని అనుకున్నారు. కానీ వారు బలహీనంగా ఉండటంతో వారు బతికే అవకాశాలు తక్కువ అని చెప్పడంతో ఆమె ఆలోచన విరమించుకుంది. ఈ క్రమంలో తన బిడ్డలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే వదిలేసి తన అక్క తో కలిసి ఆరోగ్యం ఆమె వెళ్ళిపోయింది. ఇదేమిటని అడిగితే ఆ పిల్లలు బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయనీ.. అందువల్ల వదిలేసి వెళ్తున్నట్టు చెప్పింది. దీంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు.