జాతీయ జెండాకు ఘోర అవమానం

by Anukaran |   ( Updated:2021-08-14 23:34:50.0  )
జాతీయ జెండాకు ఘోర అవమానం
X

దిశ, జడ్చర్ల : 75 వసంతాలు పూర్తి చేసుకున్నా నేటికి జాతీయ జెండాను సరిగ్గా ఎగరేయలేని దుస్థితిలో మిడ్జిల్ మండలంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ జాతీయ జెండాలను కనీసం ఎలా ఎగరవేయాలనే అవగాహన కూడా లేకపోవడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండల కేంద్రంలో, 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నిర్లక్ష్యంగా జాతీయ జెండాలను ఆవిష్కరించి అవమాన పరిచారు. గ్రంథాలయం వద్ద గ్రంథాలయ అధికారి అవమానకరంగా జెండాను ఎగరవేశారు. మహాత్ముడు గాంధీ చిత్రపటానికి గత సంవత్సరం వేసిన పూల దండలు ఈ సంవత్సరం కూడా వేసి వారి నిర్లక్ష్యాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద వైద్యాధికారులు జాతీయ జెండాను తలకిందులుగా ఎగరేశారు.

ఇదిలా ఉండగా మహిళా డాక్రా భవనం వద్ద మహిళా సంఘం అధ్యక్షురాలు, తలకిందులుగా జాతీయ జెండాను ఎగరవేయగా, మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ప్రజా ప్రతినిధి నిర్లక్ష్యంగా మధ్యలో ఉన్న జెండాను ఎగరవేయడం గమనార్హం. జాతీయ జెండాలు నిర్లక్ష్యంగా ఎగరేసి జెండాను అవమానపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed