- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతడు టీచింగ్‌లోనే కాదు.. ఆ పనిలోను దిట్టే ?
దిశ, ధర్మపురి : బళ్ళో పాఠాలు చెప్పడమే కాదు కనుమరుగై పోతున్న పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని బలంగా నమ్మిన ఉపాద్యాయుడు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం హరిత హారం మొదలు పెట్టక ముందు నుండే పర్యావరణాన్ని పరిరక్షించాలని తన స్వంత ఖర్చుతో మొక్కలు నాటుతున్నాడు. ఎవరో ఏదో చేస్తారని చూడ కుండా తన వంతుగా చేపట్టిన ఈ కార్యక్రమంతో ధర్మపురిలో పలువురితో శబాష్ అనిపించుకుంటున్నారు. ధర్మపురికి చెందిన కాసర్ల వెంకట రమణ ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో గణిత బోదకుడిగా పని చేస్తున్నారు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ధర్మపురి పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టారు. ధర్మపురి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలలో సంవత్సరానికి దాదాపు 100 మొక్కలను నాటుతూ వస్తున్నారు. దానిలో 50 మొక్కలకు తన స్వంత ఖర్చుతో టీగార్డులను చేయించి అమరుస్తారు.
2003 సంవత్సరంలో ధర్మపురి పట్టణంలో తీవ్రంగా నీటి ఎద్దడి ఏర్పడి , భూగర్బజలాలు అడుగంటి పోవడంతో పాటు మరో పక్క చెట్లు లేక వాతవరణం కాలుష్యంతో దెబ్బతింటుందని భావించిన ఆయన తన స్వంత ఖర్చుతో కూలీలతో గుంతలు తవ్వించి మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కల కోసం స్వతంగా రూ. 70 వేలు వెచ్చించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం 100 మొక్కలను నాటుతూ వస్తున్నారు. పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా వెంటకరమణ నాటిన మొక్కలు వృక్షాలుగా పెరిగాయి. పట్టణంలో ప్రధాన కూడలైన గోదావరి వద్ద, చింతామని చేరువు వద్ద , బస్టాండ్ వద్ద, మార్కెట్లో, హరితా హోటల్ వద్ద , రహదారుల వెంట స్వంత ఖర్చులతో కూలీలతో గుంతలు తవ్వంచి మొక్కలను నాటారు. ఆయన అప్పుడు నాటిన మొక్కలు ఇప్పుడు వృక్షాలుగా మారాయి. కాగా ఆయన నాటిన చెట్లను పట్టణ అభివృద్దిలో బాగంగా నరికి వేయడం బాధకరం.
50 మంది విద్యార్థుల దత్తత..
వెంకటరమణ తాను గతంలో పని చేసిన నేరెల్ల గ్రామంలోని పాఠశాలలో 50 మంది విద్యార్థులను దత్తత తీసుకొని వారి గృహాలలో, వారి వీధులలో వివిధ రకాల మొక్కలను నాటే విధంగా చైతన్య పరిచారు. విద్యార్థులు మొక్కలను నాటిన తర్వాత టీగార్డలను ఏర్పాటు చేసి మొక్కలను ఏవిధంగా పెంచాలో సలహాలు సూచనలును ఆయన విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు నాటిన మొక్కలు ఇప్పుడు వృక్షాలుగా మారాయి.
పర్యావరణ పరిరక్షణలో నేను సైతం..
ధర్మపురిలో ప్రతీ వేసవి కాలంలో నీటి సమస్య తలెత్తుతుండేది. ఎందుకు భూగర్బజలాలు ఎండిపోయి నీటి మట్టం తగ్గుతున్నదనే దానిపై నేను విచారం చేశాను. ఇదంత చెట్లు లేక పర్యావరణ లోపంతో జరుగుతున్నదని గ్రహించాను. అప్పుడు ధర్మపురిలో మొక్కలను నాటి ధర్మపురిలో నీటి ఎద్దడి లేకుండా చూడలనే సంకల్పం నాలో తట్టింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం వంద మొక్కలను నాటుతూ వస్తున్నాను. నాటిన మొక్కలను కాపాడటం కోసం నేనే స్వంత ఖర్చుతో టీగార్డులను ఏర్పాటు చేశాను. నేను నాటిన మొక్కలు ఈ రోజు వృక్షాలుగా మారాయి. కాని నేను నాటిన మొక్కలు వృక్షాలుగా అయిన వాటిని అక్కడక్కడ కొట్టి వేయడం వల్ల నాకు చాలా బాధగా ఉంది.
= కాసర్ల వెంకట రమణ ప్రభుత్వ ఉపాద్యాయుడు