ఆన్‌లైన్ క్లాస్.. కొండెక్కిన విద్యార్థి

by Shamantha N |
ఆన్‌లైన్ క్లాస్.. కొండెక్కిన విద్యార్థి
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ కారణంగా తాజాగా పాఠశాల యాజమాన్యాలు ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, ఆన్‌లైన్ క్లాసుల కోసం పేద, మారుమూల గ్రామస్తుల విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. సరైన వసతులు, ముఖ్యంగా సిగ్నల్ లోపం కారణంగా పడరాని పాట్లు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ విద్యార్థి సిగ్నల్ అందడం లేదని ఏకంగా ఊరిలోని కొండను ఎక్కి మరీ ఆన్ లైన్ పాఠాలు వింటున్నాడు. ఈ ఫోటోలను భారత మాజీ క్రికెటర్, డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్‌గా పేరొందిన వీరేందర్ సేహ్వాగ్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్ అయింది.

రాజస్థాన్‌లోని బార్మెర్‌కు చెందిన హరీష్ ఆన్ లైన్ ద్వారా పాఠాలు వినేందుకు.. ఇంటర్ నెట్ కోసం ప్రతి రోజూ పర్వతాన్ని ఎక్కుతున్నాడు. అతడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు క్లాస్ ముగిసే వరకు ఆ కొండపైనే ఉండి తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. ఈ వార్త తెలుసుకున్న సెహ్వాగ్ ఇటువంటి విద్యార్థుల అంకిత భావాన్ని ఆరాధించాలని పిలునిచ్చారు. అలాగే ఆ విద్యార్థికి సహాయం చేస్తానని ట్వీట్ చేశారు. సెహ్వాగ్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వార్త చూసిన నెటిజన్లు ఒక్కోరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే చాలా ప్రాంతాల్లో ఆన్ లైన్ క్లాసులు కష్టంగా మారాయంటూ విమర్శిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed