ఆ జిల్లాలో కంపించిన భూమి.. బయటకు పరుగులు తీసిన జనం

by Aamani |
ఆ జిల్లాలో  కంపించిన భూమి.. బయటకు పరుగులు తీసిన జనం
X

దిశ,బెజ్జుర్ : ఒక్క సారిగా భూమి కంపిచడంతో కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా‌లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం‌లోని కౌటాల, చింతల మానేపల్లి , బెజ్జూర్ మండలాలో ఆదివారం రాత్రి ఆరు యాభై ఐదు నిమిషాలకు ఒకేసారి భూమి కంపించింది. దీంతో ప్రజలు హైరానా పడ్డారు. ఏం జరుగుతుందోనని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు, అంతే కాకుండా భూ ప్రకంపనలు మేము ఎప్పుడూ చూడలేదని ఆందోళన చెందారు. సిర్పూర్ నియోజకవర్గం‌లో భూమి కంపిచడం మొదటిసారి అని ప్రజలు తెలిపారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో భూమి కంపించడంతో ఇంట్లోని వస్తువులు వంట సామగ్రి కింద పడిపోవడంతో ఇంట్లో ఉన్న ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.

Advertisement

Next Story

Most Viewed