- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొన్నది ఒకటి కబ్జా చేసింది మరొకటి
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కబ్జాకు గురయ్యింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు మండలం తుర్కయాంజల్ గ్రామంలో సర్వే నెంబర్ 631 లో 88 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో కొన్నేళ్ల కిందట వరకు నిరుపేదలు సాగు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రికవరీ చేసుకుంది. ఆ భూమి పక్కనే 638, 639 సర్వే నెంబర్ పట్టా భూమిలో వెంటేజ్ హోమ్ కంపెనీ 52 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేసింది. ఈ వెంచర్ లో 82వ ప్లాట్‌ను రియల్ ఎస్టేట్ వ్యాపారి కొనుగోలు చేశాడు. అయితే ఆ ప్లాట్‌కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కబ్జా చేశాడు.
స్పందించని రెవెన్యూశాఖ
ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని స్థానికులు, సీపీఎం, సీపీఐ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అంతేకాకుండా ఉన్నతాధికారులైన తహసీల్దార్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోవతంతో అదనపు కలెక్టర్ హరీశ్ దృష్టికి తీసుకెళ్లడంతో సర్వే చేయాలని ఆదేశించారు. సర్వే నెంబర్ 631 ప్రభుత్వ భూమికి సర్వే నెంబర్ 639 పట్టా భూమి ఆనుకొని ఉంది. అయితే ప్రభుత్వ భూమిలో తుర్కయాంజల్ నుంచి నాదర్ గుల్లు గ్రామానికి వెళ్లే దారి ఇరువైపులా ప్రభుత్వ భూమి ఉంది. కానీ పట్టా సర్వే పక్కనే ఉన్న 1000 గజాల ప్రభుత్వ భూమి కబ్జా చేశారు.
త్వరలోనే మళ్లీ సర్వే చేస్తాం
‘తుర్కయాంజల్ గ్రామంలోని 631 సర్వేనబర్లో ప్రభుత్వ భూమిపై ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఫిర్యాదు వస్తే ఆర్డీవో స్థాయి సర్వేయర్‌తో సర్వే చేసి హద్దులు పెట్టాం. అయినప్పటికీ ఆరోపణలు అలాగే ఉండడంతో స్థానికులు అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో అదనపు కలెక్టర్ ఏడీ సర్వేయర్‌ను సర్వే చేయాలని ఆదేశించడంతో త్వరలోనే సర్వే చేస్తామని’ అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ వెంకట్ రెడ్డి తెలిపారు.