- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేకు టోకరా..
దిశ వెబ్ డెస్క్: ఎమ్మెల్యేకు టోకరా వేసేందుకు ప్రయత్నించాడో ప్రబుద్దుడు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరిట ఎమ్మెల్యేను మోసం చేసేందుకు ప్రయత్నించాడో వ్యక్తి. మీ నియోజక వర్గానికి ఇన్ని కోట్ల నిధులు ఇస్తామని అందుకు ఇంత నగదు పలానా అకౌంటుకు పంపాలంటూ కొందరు ప్రజాప్రతినిధులకు ఫోన్లు చేశాడు. తీరా అసలు విషయం తెలియడంతో పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. దీంతో నిందుతున్ని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
వివరాల్లో కెళితే అనంతరం జిల్లా కల్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను పరిశ్రమల ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ నని పరిచయం చేసుకున్నాడు. మీ నియోజక వర్గానికి కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించిందనీ చెప్పుకొచ్చాడు. యూనిట్‌కు రూ.25 లక్షల రుణం ఇస్తామని అందుకోసం లబ్ధిదారుల వాటా కింద 10 శాతం చెల్లించాలంటూ తెలిపాడు. కాగా అనుమానం వచ్చి పరిశ్రమలశాఖ అధికారులను ఎమ్మెల్యే ఆరా తీశారు. కాగా అలాంటి పథకం ఏదీ లేదని అధికారులు చెప్పడంతో ఎమ్మెల్యే షాక్ అయ్యారు. దీంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్ నంబర్ ట్రేస్ చేసి నిందితున్ని పట్టుకునే పనిలో పడ్డారు.