పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం.. కేబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ

by Shyam |
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం.. కేబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోడు భూముల సమస్య పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు కేబినెట్ సబ్ కమిటీ ప్రకటించింది. హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో శుక్రవారం మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అజయ్ కుమార్ తో వేసిన కేబినెట్ సబ్ కమిటీ రెండో సమావేశం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో పోడు భూముల సమస్య – పరిష్కారం, తెలంగాణలో జిల్లాల వారీగా పోడు భూముల వివరాలు, గిరిజనులు, గిరిజనేతరులు సాగు చేస్తున్న పోడు భూములపై కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. త్వరలోనే గిరిజనుల సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా, అటవీ శాఖ పిసిసీఎఫ్ శోభ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed