- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూమి కంటే పెద్ద గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
దిశ, ఫీచర్స్: భూమి కాకుండా మరో గ్రహంపై జీవులున్నాయా? అక్కడ మానవ మనుగడ సాధ్యమేనా? ఇంతకీ గ్రహంతరవాసులున్నారా?.. ఇలాంటి ఎన్నో సందేహాలు, అంతుచిక్కని రహస్యాల గురించి తెలుసుకునేందుకు అనంతమైన విశ్వంలో నిరంతర అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను గుర్తించే శాస్త్రవేత్తలు.. తాజాగా 36 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ కొత్త గ్రహాన్ని కనుగొన్నారు.
కానరీ దీవుల్లోని ‘ఇన్‌స్టిట్యూటో డి ఆస్ట్రోఫిజికా డి కానరియాస్’ విద్యార్థి కక్ష్యలో తిరుగుతున్న ‘జీజే 740’ అనే కొత్త సూపర్ ఎర్త్‌ను కనుగొన్నాడు. భూమి కంటే దాదాపు 3.5 రెట్ల అధిక ద్రవ్యరాశి కలిగిన ఈ గ్రహం.. నక్షత్రం చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి 2.4 రోజులు మాత్రమే పడుతుంది. ఈ లెక్కన భూమి 365.25 రోజుల్లో ఏడాది కాలాన్ని పూర్తిచేస్తే, ఈ కొత్త సూపర్ ఎర్త్‌కు మాత్రం ప్రతి రెండున్నర రోజులకో కొత్త ఏడాది. కాగా అతి తక్కువ కక్ష్యా కాలాన్ని కలిగి ఉన్న రెండో గ్రహం ఇదేనని ఖగోళ శాస్త్ర రచయిత బోర్జా టోలెడో పాడ్రాన్ అన్నారు.
‘సూపర్’ ఎర్త్ అంటే ఏమిటి?
భారీ పరిమాణం ఉన్నందున ఈ గ్రహాన్ని ‘సూపర్’ ఎర్త్ అని పిలుస్తున్నారు. భూమి కంటే సుమారు రెండు రెట్ల పరిమాణం,10 రెట్ల ద్రవ్యరాశిని కలిగి ఉన్న సూపర్ ఎర్త్ ప్లానెట్.. రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తుంది. ఖగోళ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం పాలపుంతలో డజన్ల సంఖ్యలో రెడ్ డ్వార్ఫ్ నక్షత్రాలుండగా.. ఇవి పరిమాణంలో అతిచిన్నవి మాత్రమే కాక అతి తక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. అందుకే వీటిని ‘కూల్ స్టార్స్’గా పిలుస్తారు. అయితే సూపర్ ఎర్త్ గ్రహం ఈ రెడ్ డ్వార్ఫ్ నక్షత్రం చుట్టూ వేగంతో తిరుగుతున్నప్పుడు ఒకవైపు ఎప్పుడూ వేడిగా ఉంటే, మరోవైపు రాత్రి కాబట్టి గడ్డకట్టే ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఏదేమైనా మొత్తం మీద భూమి లేదా వీనస్ వంటి వాతావరణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసాలను సమం చేస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. రెడ్ డ్వార్ఫ్ స్టార్స్ చుట్టూ ఉన్న వాతావరణంలో జీవించేందుకు అనుకూల పరిస్థితులు ఉంటాయని 2013లో కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.