సీఐ జగదీశ్ కేసులో కొత్త మలుపు

by Anukaran |   ( Updated:2020-11-21 12:32:27.0  )
సీఐ జగదీశ్ కేసులో కొత్త మలుపు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్ అవినీతి కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో డీఎస్పీ లక్ష్మీ నారాయణ పాత్ర ఉన్నట్టు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం విచారణ చేపట్టారు. కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో రికార్డులను ఏసీబీ అధికారులు తనిఖీ చేసారు. ఉదయం డీఎస్పీ లక్ష్మీ నారాయణ అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటిని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. విషయం తెలుసుకుని హుటాహుటిన హైదరాబాద్ నుంచి కామారెడ్డికి డీఎస్పీ లక్ష్మీనారాయణ చేరుకున్నారు. కార్యాలయంలో డీఎస్పీ లక్ష్మీనారాయణను ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.

కాగా క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడు సుధాకర్ ఫిర్యాదు మేరకు కామారెడ్డి సీఐ జగదీశ్, సుజయ్ అనే వ్యక్తిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. .

Advertisement

Next Story