- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిర్యానీలో లెగ్ పీస్ రాలేదని కేటీఆర్‌కు ట్వీట్
దిశ, తెలంగాణ బ్యూరో : “నేను ఎక్స్‌ట్రా మసాలాతో పాటు ఎక్స్‌ట్రాలెగ్ పీస్‌తో బిర్యానీ ఆర్డర్ చేశాను. కానీ మాసాలా లేదు.. లెగ్ పీస్ కూడా రాలేదు. ఇదేనా ప్రజలకు సేవ చేసే విధానం?“ అంటూ ఒక నెటిజన్ కేటీఆర్‌కు శుక్రవారం ట్వీట్ చేశాడు. దీనిపై ఎలా స్పందించాలో అర్థం కాని మంత్రి కేటీఆర్ “బ్రదర్.. దీన్ని నాకెందుకు ట్యాగ్ చేశావు? ఈ విషయంలో నేను ఏం చేయాలని కోరుకుంటున్నావ్?“ అంటూ బదులిచ్చారు. తోటకూరి రఘుపతి అనే నెటిజన్ కేటీఆర్ ట్విట్టర్ హాండిల్‌కు టాగ్ చేయడం, దానికి ఆయన నుంచి రిప్లై రావడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జొమాటో కంపెనీకి చికెన్ బిర్యానీలో ఎక్స్‌ట్రా మసాలా, ఎక్స్‌ట్రా లెగ్ పీస్ రాకపోతే దానికి కేటీఆర్‌కు ఏం సంబంధం అనే సందేహం సహజం. కేటీఆర్‌కు కూడా ఇదే సందేహం వచ్చింది. అందుకే ఆ తీరులో రిప్లై ఇచ్చారు. కరోనా కట్టడిలో క్షణం తీరిక లేకుండా తలమునకలైన టాస్క్ ఫోర్స్ చైర్మన్ కేటీఆర్‌కు ఈ వింత అనుభవం ఎదురు కావడంపై నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు చేశారు. నిత్యం కరోనా పేషెంట్లకు ఆక్సిజన్, కాన్సెంట్రేటర్, రెమిడెసివిర్ లాంటి మందులను సమకూర్చే పనులతో పాటు వైద్యారోగ్య రంగంలో తీసుకోవాల్సిన చర్యలపై నిత్యం సమీక్షల్లో బిజీగా ఉన్న కేటీఆర్‌కు ఒక విచిత్ర ట్వీట్‌తో ఏం చేయాలో అర్థం కాలేదు.
కరోనా పాజిటివ్ బారిన పడి కోలుకున్న తర్వాత కరోనా పేషెంట్లకు రకరకాల రూపాల్లో సాయం వ్యక్తిగత స్థాయిలో సాయం చేస్తుండడంతో పాటు రాష్ట్రంలో కరోనా కట్టడిపై కూడా టాస్క ఫోర్స్ చైర్మన్‌గా ఎక్స్‌ట్రా వర్క్ చేస్తున్నారు. కానీ ఎక్స్‌ట్రా మసాలా, ఎక్స్‌ట్రా లెగ్ పీస్ రాలేదని నెటిజన్ ట్వీట్ చేయడం ఒక విచిత్రమైతే… స్పందనగా కేటీఆర్ ఇచ్చిన సమాధానం మరో ఆసక్తికరమైన అంశంగా మారింది.