- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘డ్రగ్స్ ఫ్రీ’ సొసైటీ లక్ష్యంగా ‘నిజాత్’ క్యాంపెయిన్!
దిశ, ఫీచర్స్ : ప్రజాప్రతినిధులు, అట్టడుగు స్థాయి మహిళలతో సహా ప్రజల సహకారంతో ఛత్తీస్‌గఢ్‌లోని ‘కొరియా’ జిల్లా పోలీసులు ఈ ఏడాది జూలైలో ‘నిజాత్(రిడాన్స్)’ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఆనాటి నుంచి ఆ జిల్లాలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. ప్రస్తుతం ఏ ప్రాంతాన్ని కదిలించిన ‘మత్తు పదార్థాల’ కేసులు కనిపిస్తున్నాయి. యువత ఆ మత్తులో చిత్తవుతుండగా, ఎంతోమంది దాన్ని వ్యాపారంగా మలుచుకున్నారు. దీంతో చట్ట సంస్థలకు ‘డ్రగ్’ కంట్రోల్ చేయడం ఓ సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే కొరియా పోలీసులు నిరంతర నిఘా, పక్కా ప్రణాళికతో తమ జిల్లా నుంచి మాదక ద్రవ్యాన్ని దాదాపుగా నిర్మూలించడంలో సఫలీకృతులయ్యారు.
మాదకద్రవ్యాలు, నార్కోటిక్స్, బూట్‌లెగింగ్ (అక్రమ తయారీ, పంపిణీ లేదా వస్తువుల విక్రయం, ముఖ్యంగా మద్యం, మత్తుపదార్థాలు) దుర్వినియోగాన్ని తుడిచిపెట్టే బాధ్యతను తీసుకున్న కొరియా పోలీసులు.. ‘నిజాత్’ క్యాంపెయిన్ ప్రారంభించారు. ఇందులో భాగంగా కఠినమైన చర్యలు అమలు చేయడం, ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థినీ విద్యార్థులతో పాటు యువతకు అవగాహన కల్పించడం, మత్తుపదార్థాలకు అలవాటుపడ్డ వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం వంటి త్రిముఖ వ్యూహాన్ని అమలు చేసిన పోలీసులు.. ప్రజాప్రతినిధులు, అట్టడుగు స్థాయి మహిళలతో సహా ప్రజల సహకారంతో డ్రగ్స్ స్మగ్లింగ్‌ను ‘నిజాత్’ డ్రైవ్ ద్వారా నిరోధించగలిగారు. ‘నిజాత్’కు అందరి నుంచి మద్దతు రాగా.. ప్రముఖులు, సినీ నటులు, ప్రముఖ జానపద గాయకులు, ఒపీనియన్ మేకర్స్ నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో ఈ డ్రైవ్ మరింత ఊపందుకుంది. తక్కవ రోజుల్లోనే డ్రగ్స్ వ్యాపారానికి చెక్ పెట్టగలిగింది. ఆ వ్యసనం నుంచి బయటపడటంతో వందలాది కుటుంబాలు ఆనందిస్తున్నాయి.
మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నుంచి కొరియా జిల్లాను మార్చాలనే కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన మా ప్రచారానికి ప్రజల సహకారం తీసుకోవడంలో మేము విజయం సాధించాం. డ్రగ్స్ తీసుకోమని ఒత్తిడి చేస్తున్న వారి గురించి చెబుతామని ప్రజలు ప్రతిజ్ఞ తీసుకున్నారు. ‘నిజాత్’ ప్రచారంలో వాల్ పెయింటింగ్స్ వేయించాం. యువకులు విద్యార్థులతో ర్యాలీలు చేపట్టాం. పండుగ సందర్భాలలో రంగోలీలు నిర్వహించడం, యాడ్స్ ఇవ్వడం మా పనిని మరి సులభతరం చేశాయి. ఐదు నెలల స్వల్ప వ్యవధిలో 887 కేసులు నమోదు కాగా, 923 మంది మాదకద్రవ్యాల వ్యాపారులను అరెస్టు చేశాం. డి-అడిక్షన్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో వందలాది మంది యువతకు కౌన్సిలింగ్ ఇచ్చాం. అది కూడా మంచి ఫలితాన్ని అందించింద’ని కొరియా జిల్లా పోలీస్ శాఖ తెలిపింది.