వ్యాక్సిన్ తీసుకొని న్యూ డెమోక్రసీ నాయకుడు మృతి

by Aamani |   ( Updated:2021-05-07 00:16:59.0  )
వ్యాక్సిన్ తీసుకొని న్యూ డెమోక్రసీ నాయకుడు మృతి
X

దిశ బోధన్ : కరోనా వ్యాక్సిన్ తీసుకుని అస్వస్థకు గురై బోధన్ సబ్ డివిజన్ కమిటీ న్యూ డెమోక్రసీ పార్టీ,ఐ ఎఫ్ టీ యూ సభ్యుడు దండే యాదవ్ గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో చోటుచేసుకుంది. దండే యాదవ్ వారం రోజుల క్రితం కరోనా నివారణ వ్యాక్సిన్ తీసుకున్నాడు. అయితే తాను వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచి జ్వరం వచ్చింది. జ్వరంతో బాధ పడుతూ నిన్న రాత్రి 10 గంటల సమయంలో మృతిచెందారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం పోచారం గ్రామంలో జరుగనున్నట్టు వామపక్ష నాయకులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed