సర్కార్ ఆదేశిస్తే థియేటర్ల మూసివేత

by Shyam |
సర్కార్ ఆదేశిస్తే థియేటర్ల మూసివేత
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఫిల్మ్ చాంబర్‌లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కరోనా వైరస్ ప్రభావంతో థియేటర్ల మూసివేతపై చర్చ జరగ్గా…. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలని భావిస్తున్నారు. కరోనా విషయంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. సినిమా విడుదల, ప్రస్తుత పరిస్థితులపై చర్చించామన్న తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్ మురళీమోహన్… సినిమా థియేటర్ల బంద్‌కు ఆదేశిస్తే వెంటనే అమలు చేస్తామన్నారు.

మరోవైపు కరోనాపై హై అలర్ట్ ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్… దీనిపై అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే విద్యాసంస్థలు, థియేటర్ల మూసివేతపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు జిల్లాలో థియేటర్లను మూసివేశారు. ఇటలీ నుంచి నెల్లూరు వచ్చిన యువకుడికి కరోనా లక్షణాలు ఉండడంతో.. ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేటెడ్ వార్డును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కలెక్టర్ ఆదేశాలతో థియేటర్లను మూసేశారు.

tags : Telangana Film Chamber, Meeting, CoronaVirus

Advertisement

Next Story

Most Viewed