- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫైనాన్స్ కట్టమన్నందుకు.. ఆటో తగులబెట్టిండు
దిశ ప్రతినిధి, వరంగల్: పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఓ ఆటో యజమాని వినూత్నంగా నిరసన తెలిపాడు. పోలీస్ స్టేషన్ ఎదుటే ఆటోకు నిప్పు పెట్టి తన నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో శుక్రవారం జరిగింది. వివరాళ్లోకి వెళితే… ప్రవీణ్ అనే వ్యక్తి పొట్ట కూటి కోసం పట్టణంలో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆటో కొనుగోలు కోసం ఫైనాన్షియర్ల వద్ద డబ్బులు తీసుకున్నట్టు తెలిపాడు. అయితే కరోనా నేపథ్యంలో ఆటో సరిగా నడపక, ఫైనాన్స్ కట్టడం ఆలస్యమయిందని వాపోయాడు. అయితే ఫైనాన్స్ సిబ్బంది కిస్తీ కట్టాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో, వారి వేధింపులు భరించలేక పట్టణ పోలీసులకు ఫిర్యాదులు చేశానని తెలిపాడు. ఫిర్యాదు అనంతరం వారి వేధింపులు మరింత పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని, తీవ్ర మనస్థాపం చెందిన ప్రవీణ్ పరకాల పోలీస్ స్టేషన్ ఎదుట తన ఆటోకు నిప్పుదగ్ధం చేసి నిరసన తెలిపాడు. ఈ సంఘటన పట్టణంలో సంచలనం రేపింది.