మానవత్వం చూపిస్తున్న టెడ్డీ మావో

by Aamani |
మానవత్వం చూపిస్తున్న టెడ్డీ మావో
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో వింత వేషాదారణాతో అనాథలకు, యాచకుల ఆకలి తీరుస్తున్నాడు ఓ యువకుడు. నగరంలోని గంగాస్థాన్ కాలనీకి చెందిన 26 సంవత్సరాల పవన్ కుమార్ లాక్ డౌన్ సమయంలో పలువురు ఆకలిని తీర్చే యత్నం చేస్తున్నాడు. ఉదయం 10 గంటల తర్వాత హోటల్లు, టిఫిన్ సెంటర్లు బంద్ అవుతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని 10 గంటల తర్వాత రోడ్లపై ఉన్న నిస్సాహాయులు, అనాథలు, యాచకుల ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చాడు.

కొవిడ్ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలిసులకు కూడా భోజనం, టీ అందిస్తున్నాడు. అయితే అందరిలాగా కాకుండా కొంచెం వింతగా ఉండేలా ప్లాన్ చేశాడు. ఇందుకోసం అతను టెడ్డీ మావో గెటప్ మాస్కోట్ని ధరిస్తున్నాడు. ఆ గెటప్ చూపరులని ఎంతో ఆ కట్టుకుంటూ అతను ఇచ్చే ఆహారాన్ని తీసుకుంటున్నారు. తన మిత్రుడు అజయ్ సాయంతో బైక్ పై తిరుగుతూ అవసరం ఉన్నోళ్ళకు సాయం చేస్తున్నాడూ. తన తల్లిదంద్రుల సాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని, అందరూ తమకు తోచిన విధంగా ఇలా సాయం చేయాలని సూచించాడు. తన ఇన్ స్టా గ్రామ్, యూ ట్యూబ్ చానల్ టేడ్డీ మావా ద్వారా తనను సంప్రదించవచ్చని సూచించాడు.

Advertisement

Next Story

Most Viewed