అక్కడ మాస్క్ లేకుండా తిరగొచ్చు.. కానీ ఒక కండిషన్

by vinod kumar |   ( Updated:2021-04-28 05:51:44.0  )
అక్కడ మాస్క్ లేకుండా తిరగొచ్చు.. కానీ ఒక కండిషన్
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. మాస్క్ లేకుండా బయటకు రావడం ఎంత ప్రమాదకరమో అందరికి తెలిసిందే. గతేడాది నుండి ఈ మాస్క్ గోల తప్పడం లేదు. చిరాకు పుట్టినా, చెమట పట్టినా, దురద వచ్చినా మాస్క్ లేకుండా బయట కనిపిస్తే పోలీసులు చితకొట్టేస్తున్నారు. ఈ బాధ నుండి తప్పించుకోవాలని ఉందా? మాస్క్ లేకుండా ఫ్రీ గా తిరగాలనుకుంటున్నారా? అయితే వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్తుంది అమెరికా దేశం. అవునండి మాస్క్ పెట్టుకోకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వేయించుకోవాలని అమెరికా అధికారులు ప్రకటన చేశారు.

మొదటి నుండి కరోనా ప్రభావిత దేశాల్లో అమెరికా ఒకటి. ఎన్నో మరణాలను దగ్గరగా చూసిన ఈ దేశంలో కరోనా తీవ్రత తగ్గినా.. జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆదేశాలు జారీచేసింది. చాలామంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడుతున్న నేపథ్యంలో ఇలాంటి బంపర్ ఆఫర్ లు పెట్టి ప్రజలను ఆకర్షిస్తున్నారు అధికారులు. కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్నవారు మాస్క్ పెట్టుకోకపోయినా పర్లేదని, మొదటి డోసు తీసుకున్నవారు సైతం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎంచక్కా మాస్క్ లేకుండా షాపింగులకు, షికార్లకు కూడా వెళ్లవచ్చంట. కానీ బహిరంగ సభలకు, జనసమూహాలు ఉన్నచోట మాత్రం ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలని సూచించింది. ఇక ఈ ప్రకటనతో అమెరికన్లు వ్యాక్సిన్ వేయించుకొని .. షికార్లు చేయడానికి రెడీ అవుతున్నారట.

Advertisement

Next Story

Most Viewed