ఓనర్ వేధింపులతో యువతి ఆత్మహత్య

by Anukaran |
ఓనర్ వేధింపులతో యువతి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంటి ఓనర్ లైంగిక వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అదే ఇంట్లో ఉంటూ పాచి పని చేస్తూ జీవనం సాగిస్తున్న యువతి పై ఇంటి ఓనర్ కన్నేశాడు. ఈ నేపథ్యంలో తరచూ లైంగికంగా వేధించేవాడని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. గత రెండ్రోజుల అతడి వేధింపులు భరించలేక యువతి (17) ఉరి వేసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం హిమాయత్‌నగర్‌లో వెలుగుచూసింది. బాతుకు మధు యాదవ్ అనే వ్యక్తి తన ఇంట్లో పని కోసం ఇద్దరు అక్కా చెల్లెల్లను చేరదీశాడు. అయితే, అక్కాకు చెల్లె చేదోడు వాదోడుగా ఉండేది. ఈ నేపథ్యంలోనే సదరు యువతి పై మధు యాదవ్ కన్నేశాడు. తన కోరిక తీర్చాల్సిందిగా తరచూ వేధించసాగాడు. బలవంతంగా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా ఇంటి ఓనర్ వేధింపులు తాళలేక బాధితురాలు ఊరి వేసుకుందని.. కుటుంబీకులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సంఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story