షెడ్యూల్ టైం కన్నా ముందే కురిసిన వరాల జల్లు

by Shamantha N |   ( Updated:2021-02-26 07:59:32.0  )
షెడ్యూల్ టైం కన్నా ముందే కురిసిన వరాల జల్లు
X

దిశ,వెబ్‌డెస్క్: ఎన్నికల షెడ్యూల్‌కు కొన్ని నిమిషాల ముందు వెస్ట్ బెంగాల్ ప్రజలపై మమత వరాల జల్లు కురిపించారు. బెంగాల్‌లో కార్మికుల రోజు వారీ భృతిని పెంచుతూ పథకాన్ని ప్రకటించారు. నైపుణ్యం లేని కార్మికుల కూలి రూ. 144 నుంచి 202కు పెంచారు. మధ్య స్థాయి నైపుణ్య కార్మికుల కూలి రూ. 172 నుంచి రూ. 303కు పెంచారు. నైపుణ్యమున్న కార్మికుల కూలి రూ. 404గా ప్రకటించారు. అర్బన్ ఎంప్లాయిమెంట్ పథకంతో 56,500 మంది లబ్ది పొందనున్నారు. తమిళనాడులోనూ 16 లక్షల మంది రైతులకు రూ. 12వేల కోట్ల పంట రుణాలను, 6 శాతం వడ్డీకే బంగారు రుణాలను ఇవ్వాలని సీఎం పళనీ స్వామి ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story