కూతురిని అమ్మి జల్సా చేస్తున్న తండ్రి 

by Anukaran |   ( Updated:2020-08-30 11:47:22.0  )
కూతురిని అమ్మి జల్సా చేస్తున్న తండ్రి 
X

దిశ వెబ్ డెస్క్: విలాసాల కోసం తండ్రే కూతురిని అమ్మేసిన ఉదంతం కర్ణాటకలో వెలుగు చూసింది. మూడు నెలల చిన్నారిని అమ్మేసి… వచ్చిన డబ్బుతో బైక్, స్మార్ట్ ఫోన్ కొని జల్సా చేస్తున్నాడు నిందితుడు. చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నిందితుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు.

సడన్ గా అతడు విలాసాలకు పోతుండటంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చింది. దీంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు పసికందును కాపాడారు. కన్న కూతురిని ఆ నిందితుడు లక్ష రూపాయలకు సంతానం లేని దంపతులకు అమ్మేశాడని వారు వెల్లడించారు.

కూతురిని అమ్మగా వచ్చిన డబ్బుతో రూ. 50 వేలు పెట్టి బైక్, మరో రూ. 15 వేలు పెట్టి ఓ స్మార్ట్ ఫోన్ కొన్నాడని తెలిపారు. నిందితుడి భార్యను అదుపులోకి తీసుకుని విచారించగా భర్త బెదిరింపులకు లొంగిపోయే తాను కన్నబిడ్డను అమ్మేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. పాపను తిరిగి తనకు అప్పగించాలని కూడా అధికారులను ఆమె కోరినట్టు సమాచారం. ప్రస్తుతం నిందితుడు పరారీలోనే ఉన్నాడని… అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed