- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిడ్డలను ఒడ్డుకు చేర్చాడు.. కానీ తాను మాత్రం
దిశ,పాలేరు: ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బిడ్డలను కాపాడేందుకు ప్రయత్నించి ఒక తండ్రి మృత్యువాతపడ్డాడు. వివరాల్లోకి వెళితే మేడేపల్లి గ్రామానికి చెందిన కొల్లు సురేష్ కుమార్(45) తన పిల్లలతో కలిసి వాకింగ్ కి వెళ్ళాడు. సాగర్ ఎడమ కాలువలో ఈత కొడుతుండగా వారి పిల్లలు ఒడ్డున కూర్చున్నారు. ఇంతలో సురేష్ కుమార్ కొడుకు భవిత్(7) ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయాడు. అది గమనించిన సురేష్ అన్న కొడుకు భవిత్ ని పట్టుకునే ప్రయత్నం చేయబోయి అతను కూడా కాలవలో పడిపోయాడు.
ఇద్దరు కొడుకులు కాలువలో పడిపోవడం చూసిన సురేష్ హుటాహుటిన కాలువలోకి దిగి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఈ క్రమంలో నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువ కావడంతో సురేష్ నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు కాలువలో మునిగిపోయిన సురేష్ ని వెలికి తీశారు. అప్పటికే అతను మృత్యువాత పడడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.