- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీ కాళ్లు మొక్కుతా సారూ… కనీసం పంట చేతికి వచ్చే వరకైనా ఆగండి
దిశ, కరీంనగర్: దేశంలో ఎన్ని మారుతున్నా రైతుల దుస్థితి మాత్రం మారడం లేదు. పంట భూముల కోసం, నీటి కాల్వల కోసం, పంట దిగుబడి కోసం, వాటి ధరల కోసం ఎప్పుడు ఎవరో ఒకరి కాళ్లమీద పడుతూ అర్దిస్తూనే ఉంటారు. తాజాగా వ్యవసాయ బావులను ఫుడ్చొద్దు అంటూ ఒక రైతు పోలీస్ కాళ్ల మీద పడి ప్రాధేయపడి అర్థిస్తున్నా ఘటన ప్రతి ఒక్కరి కంటికి కన్నీరు తెప్పిస్తుంది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లిలో మిడ్ మానేరు డి 14 కెనాల్ కాల్వ కోసం సేకరించిన భూమిలో ఉన్న వ్యవసాయ బావులను అధికారులు పూడుస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్నస్థానిక రైతులు కెనాల్ వద్దకు వెళ్లి పంటల కోతలు పూర్తయిన తరువాత బావులు పూడ్చలంటూ వేడుకున్నారు.పోలీస్ అధికారి కాళ్లమీద పడి బావులు పూడ్చడం వెంటనే ఆపివేయాలని కన్నీరు మున్నీరుగా విలపించారు. పంటలు ఎండిపోతాయి సారూ.. మా మీద దయ ఉంచడి సారూ.. కనీసం పంట చేతికి వచ్చే వరకైనా పూడ్చివేతను ఆపాలని కోరారు. ఇక ఈ విషయమై బీజేపీ నాయకుడు గడ్డం నాగరాజు మాట్లాడుతూ లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు వేశారని, పంటలు చేతికి వచ్చే తరుణంలో బావులు పూడ్చితే అవి ఎండిపోతాయన్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్ట పోతారని, కోతల తరువాతే బావులు పూడ్చాలని కోరారు.