Suhana Khan, daughter of Shahrukh Khan: షారుఖ్.. నీ కూతురిని ఇస్తావా? నా సంపాదన తక్కువేం కాదు..!

by Shyam |   ( Updated:2021-05-27 03:24:25.0  )
Suhana Khan, daughter of Shahrukh Khan: షారుఖ్.. నీ కూతురిని ఇస్తావా? నా సంపాదన తక్కువేం కాదు..!
X

దిశ, సినిమా : బాలీవుడ్ బాద్‌‌షా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌కు తండ్రిలాగే సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంకా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందే మిలియన్ ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న సుహానా.. ఈ మధ్యే 22వ పుట్టినరోజు జరుపుకుంది. ఈ సందర్భంగా తల్లి గౌరీ ఖాన్ తనకు విష్ చేస్తూ గార్జియస్ పిక్ షేర్ చేసింది.

కాగా, ఈ అకేషన్‌ను పురస్కరించుకుని మ్యారేజ్ ప్రపోజల్ పెట్టిన సుహానా వీరాభిమాని.. ‘మీ కూతురినిచ్చి పెళ్లి చేయండి’ అని గౌరీని అడిగేశాడు. జీతం లక్ష రూపాయలకు పైనే ఉందని, తనను చక్కగా చూసుకుంటానని చెప్పాడు. ఈ ప్రపోజల్ సోషల్ మీడియా అటెన్షన్ క్యాచ్ చేయగా.. ఈ వ్యక్తి శాలరీ షారుఖ్‌ను ఇంప్రెస్ చేస్తుందా? లేదా? అని డిస్కస్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ క్రమంలో 2017లో ఫెమీనా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కూతురి పెళ్లికి సంబంధించి షారుఖ్ చెప్పిన సెవెన్ గోల్డెన్ రూల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story