- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక్క గేమ్.. రెండు ప్రాణాలు బలి
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆన్‌లైన్ మొబైల్ గేమింగ్ ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన అందె సమ్మయ్య (40) కుటుంబం కొంతకాలంగా కరీంనగర్‌లోని జ్యోతినగర్‌లో నివాసం ఉంటోంది. చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవించేవారు. పది నెలలుగా కరోనా కారణంగా చేతిలో పనిలేకపోవడంతో కుటుంబపోషణ గగనంగా మారింది. చివరకు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దీంతో ఇతర మార్గాల ద్వారా ఆదాయం కోసం సమ్మయ్య ప్రయత్నించాడు. చివరకు అతడి దృష్టి ఆన్లైన్ మొబైల్ గేమింగ్ పై పడింది.
గేమ్స్ ఆడితే డబ్బులు వస్తాయని, అప్పులు తీర్చవచ్చని, కుటుంబం కూడా గడుస్తుందని ఆశ పడ్డాడు. దాని కోసం కూడా అక్కడాఇక్కడా అప్పులు చేసి వేల రూపాయలు పణంగా పెట్టాడు. అక్కడా మోసానికి గురి కావడంతో తట్టుకోలేకపోయాడు. తీవ్ర మనోవేదనతో భార్య కృష్ణవేణి (32), కొడుకు మోక్షజ్ఞ (10)తో కలిసి ఆదివారం రాత్రి విషం తాగారు. ఇదే విషయాన్ని 100కు డయల్ చేసి చెప్పడంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని వారిని కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమ్మయ్య సోమవారం ఉదయం మరణించగా ఆయన భార్య కృష్ణవేణి సాయంత్రం విగత జీవిగా మారింది. మోక్షజ్ఞ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.