సిలిండర్ పేలుడు.. బ్యాంక్ ఉద్యోగి మృతి

by Sumithra |
సిలిండర్ పేలుడు.. బ్యాంక్ ఉద్యోగి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: నారాయణపేట జిల్లా దామరగిద్దలో ఓ ఇంట్లో సిలిండర్ పేలుడు సంభవించింది. ఆదివారం ఉదయం గ్రామంలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. దీంతో ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగి దశరథరావు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story