- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మారనున్న ‘గంగారం’ రూపు రేఖలు
దిశ, కరీంనగర్: భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని గంగారం గ్రామ రూపురేఖలు మారనున్నాయి. అంతర్జాతీయ స్థాయి హంగులతో గ్రామం అభివృద్ధి చెందనుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రణాళిక గ్రామంగా ఎంపికైన గంగారం గ్రామం దేశంలోని అన్ని గ్రామాలకు ఆదర్శం కానుంది. మంగళవారం ఈ గ్రామంలో పర్యటించిన కలెక్టర్ మహ్మద్ అజీం గ్రామాన్ని గ్లోబల్ విలేజ్‌గా మారుస్తానని అన్నారు. ఇప్పటికే తమ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న కలెక్టర్ సేవలకు గుర్తింపుగా గ్రామస్థులే స్వయంగా నిర్మించిన రోడ్డుకు కలెక్టర్ రోడ్డుగా నామకరణం చేస్తున్నామన్నారు. ఈ మట్టి రోడ్డును తారు రోడ్డుగా అభివృద్ధి చేయాలని, అదేవిధంగా మానేరు నది నుంచి ఎత్తిపోతల ద్వారా బక్కరేగడి పంటచేలకు సాగునీరు అందించాలని గ్రామస్థులు కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ అజీం మాట్లాడుతూ.. ఇదే స్ఫూర్తితో గ్రామంలో అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించి ఒక గ్లోబల్ విలేజ్‌గా గంగారంను తీర్చిదిద్దుతానని అన్నారు. గ్రామంలోని నేలల రకాలు, నీటి వనరులపై ఇప్పటికే డ్రోన్ ద్వారా సర్వే చేస్తున్నామని, త్వరలోనే వివిధ అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలను గ్రామానికి తీసుకువచ్చి అనువైన పంటలను గుర్తిస్తామన్నారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దోహదపడే పంటలను వేసేందుకు రైతుల్లో చైతన్యం తీసుకొస్తున్నామని కలెక్టర్ చెప్పారు. అలాగే గ్రామంలో పండే కూరగాయలు, పండ్లు, పూలను స్థానికంగా అమ్ముకునేలా హోల్ సేల్, రిటైల్ మార్కెట్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. 25 ఎకరాల స్థలంలో సాధారణ, డిజిటల్ లైబ్రరీ, రిషి వ్యాలీ తరహాలో జాయ్ ఫుల్ లెర్నింగ్ పద్ధతిలో విద్యార్థుల్లో సృజనాత్మకత పెరిగేలా ఐదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. మినీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తానన్నారు. మండలాన్నిమూడు క్లస్టర్లుగా విభజించి గంగారంను సెంట్రల్ క్లస్టర్‌గా చేసి మెటర్నిటీ హాస్పిటల్ ద్వారా గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సుమతి, తదితర అధికారులు పాల్గొన్నారు.