- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫోర్జరీతో తప్పుడు రిజిస్ట్రేషన్.. ఏ1 గా నరేంద్ర చౌదరి
దిశ, క్రైమ్ బ్యూరో: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ వ్యవహారంలో గోల్‌మాల్ చేసినట్టుగా ఆరోపణల నేపథ్యంలో ఎన్టీవీ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మల నరేంద్ర చౌదరిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో కేసు నమోదయ్యింది. కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. 1988 మార్చి 25న జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ద్వారా సీహెచ్ శిరీషాకు 853-ఎఫ్ ప్లాట్(1519 చదరపు గజాలు)ను కేటాయించారు. సొసైటీ బైలాస్ ప్రకారం ప్లాట్‌ను మూడేళ్లల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ, సీహెచ్ శిరీషా యూఎస్ఏకు వెళ్లారు. ఆ దేశానికి చెందిన వ్యక్తినే వివాహం చేసుకోవడం కారణంగా ఆమె ఇండియాకు తిరిగి రాలేదు. దీంతో ఆ ప్లాట్ అప్పటి నుంచి ఖాళీగా ఉంటుంది. ఈ ప్లాట్‌ను బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ మద్దతుతో నరేంద్ర చౌదరి, మరో 7 గురితో కలిసి సీహెచ్ శిరీషా పేరుతో తప్పుడు ఐడీ ఫ్రూఫ్ తయారు చేసి, ఫోర్జరీ సంతకంతో 2020 జూన్ 26న రిజిస్ట్రేషన్ (డాక్యుమెంట్ నెంబరు 2675/2020) చేసుకున్నారు.
ఆ తర్వాత ఈ ప్లాట్‌ను సీహెచ్ శిరీషా నుంచి పి.శిరీషాకు గిఫ్ట్ డీడ్ ఇచ్చినట్టుగా మూడు రోజుల వ్యవధిలోనే 2020 జూన్ 29న (డాక్యుమెంట నెంబరు 2688/2020) మరోసారి రిజిస్ట్రేషన్ అయ్యింది. అయితే, అమెరికా వెళ్లిన సీహెచ్ శిరీషా నాటి నుంచి నేటి వరకూ రాలేదని, కానీ 853- ఎఫ్ ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో సీహెచ్ శిరీషా ఓటరు ఐడీని జతచేసినట్టు ఫిర్యాదుదారుడు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి రవీంద్రనాథ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవీంద్రనాథ్ ఫిర్యాదు మేరకు నరేంద్ర చౌదరి (ఏ1), పి.హనుమంతరావు (ఏ2), ఏ.సురేష్ రెడ్డి (ఏ3), సీహెచ్ కృష్ణమూర్తి (ఏ4), డి.శ్రీనివాస్ రెడ్డి (ఏ5), ఎండీ జావీదుద్దీన్ (ఏ6), సీహెచ్ శిరీష (ఏ7) ( ఎవరి పేరుతో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయ్యిందో), పి.శ్రీహరి (ఏ8), బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ పేర్లపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. దీంతో వీరిపై ఐపీసీ సెక్షన్లు 120-బి, 406, 408, 409, 419, 420, 467, 468, 471, 477ఏ కింద ఎఫ్ఐఆర్ నమోదు అయినట్టు సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అక్రమంగా ప్లాట్ రిజిస్ట్రేషన్ కారణంగా సొసైటీకి దాదాపుగా రూ. 40 కోట్లు నష్టం వాటిల్లినట్టు ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు.