కారు బోల్తా.. ఇద్దరు మృతి

by Sumithra |
కారు బోల్తా.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందినవారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story