Today Weather Update: నేటి వాతావరణ అప్డేట్ ఇదే

by Prasanna |
Today Weather Update: నేటి వాతావరణ అప్డేట్ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్ : గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ రోజు ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడఉరుములు మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు రెండు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

హైద్రాబాద్ లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మధ్యాహ్నం 12 తర్వాత వానలు పడే అవకాశం ఉంది.

వరంగల్ లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఉదయం 11 తర్వాత వానలు పడే అవకాశం ఉంది.

విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఉదయం 10 తర్వాత అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది.

విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మధ్యాహ్నం 12 తర్వాత వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.

Advertisement

Next Story