వర్ష బీభత్సం.. 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు

by Mahesh |
వర్ష బీభత్సం.. 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు
X

దిశ, వెబ్ డెస్క్: వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనం, వాయుగుండం, తుఫానుల కారణంగా తమిళనాడు(Tamilnadu) అతలాకుతలం అవుతోంది. నెల రోజుల వ్యవధిలో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. దీంతో ఎక్కడ చూసిన వరద నీటితో అన్ని ప్రాంతాలు బురదమయంగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగానే బంగాళాఖాతం(Bay Of Bengal)లో మరో తీవ్ర అల్పపీడనం(LPA) ఏర్పడింది. ఇది బుధవారం రాత్రికి వాయుగుండంగా మారి.. శ్రీలంక(Sri Lanka), తమిళనాడు(Tamilnadu) వైపు దూసుకొచ్చింది. దీంతో తమిళనాడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే రాష్ట్ర రాజధాని చెన్నై(Chennai)లో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాంతాలు, రహదారులు నీటిలో మునిగిపోయాయి. అలాగే మరో 24 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్(Orange Alert).. జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం చెన్నై సహా 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అలాగే అధికారులు అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది. అయితే ఈ అల్పపీడనం కారణంగా ఏపీలోని పలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed